Begin typing your search above and press return to search.

ఏజీపై జ‌గ‌న్ అసంతృప్తి.. వైసీపీ నేత‌ల మాట‌!

By:  Tupaki Desk   |   7 Feb 2021 5:30 PM GMT
ఏజీపై జ‌గ‌న్ అసంతృప్తి.. వైసీపీ నేత‌ల మాట‌!
X
రాష్ట్ర అడ్వొకేట్ జ‌న‌ర‌ల్(ఏజీ) ఎస్. శ్రీరాంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అసంతృప్తితో ఉన్నారా? రాష్ట్ర ప్ర‌భు త్వ వాద‌న‌ల‌ను, వ్యూహాల‌ను ఆయ‌న స‌రిగా అర్ధం చేసుకోలేక పోతున్నార‌ని సీఎం భావిస్తున్నారా? త్వ‌ర లోనే ఏజీని మార్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లు వైసీపీ నేత‌ల మ‌ధ్య హాట్ టాపిక్‌గా మారాయి. నాయ‌కులు గ‌డిచిన రెండు రోజులుగా ఈ విష‌యంపైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్న ‌ట్టు తెలి సింది. సీనియ‌ర్ నాయకులు త‌మ ఫోన్ సంభాష‌ణ‌ల్లో ఇదే విష‌యంపై చ‌ర్చించుకుంటున్నార‌ని స‌మాచా రం.

కొన్నాళ్లుగా ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. అయితే.. ఇదంతా వ్యూహం ప్ర‌కారం.. త‌న ప్ర‌భుత్వంపై జ‌రుగుతున్న వ్య‌క్తిగ‌త దాడిగా.. జ‌గ‌న్ భావించారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష నాయ కులు చంద్ర‌బాబు వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేసే కొంద ‌రు న్యాయ‌మూర్తుల ఫ‌లితంగానే త‌న ప్ర‌భుత్వానికి హైకోర్టు తలంటుతోంద‌ని జ‌గ‌న్ భావిస్తూ వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏకంగా రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పైనా.. సుప్రీం కోర్టులోని ఓ కీల‌క న్యాయ‌మూర్తి పైనా జ‌గ‌న్ ఫిర్యాదులు చేశారు.

దీంతో ఏం జ‌రిగిందో ఏమో.. రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ని మారుస్తూ.. సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ప్ర‌భుత్వానికి కొంత మేర‌కు ఊర‌ట ల‌భిస్తుంద‌ని జ‌గ‌న్ భావించారు. అయితే.. న్యాయ‌మూర్తి మారినా.. న్యాయం మార‌లేదు. ప్ర‌భుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. ఇటీవ‌ల ఎన్నిక‌లు నిలిపివేయాలంటూ.. ప్ర‌భుత్వం చేసిన పిటిష‌న్‌లో నూ ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఈ నేప‌థ్యంలో సుప్రీం కోర్టుకు చెందిన కొంద‌రు న్యాయ‌మూర్తులు..(జ‌గ‌న్‌కు స‌న్నిహితంగా ఉండేవారు) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌.. హైకోర్టులో స‌రైన వాద‌న‌లు వినిపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని వారు కామెంట్ చేశారు. ఈ ప‌ర్య‌వ‌సానాల‌ను ఆది నుంచి గ‌మ‌నిస్తున్న ప్ర‌భుత్వ స‌ల‌హ‌దారు కూడా ఒక‌రు.. ``హైకోర్టులో మేం స‌రైన వాద‌న‌లు వినిపించ‌లేక పోయామ‌నేది కూడా కార‌ణ‌మే!`` అని వెల్ల‌డించారు. ఏతా వాతా .. ఎలా చూసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం ఆశించిన విధంగా హైకోర్టులో ఏ విష‌యంలోనూ పైచేయి సాధించ‌లేక పోయారు. అనుకూలంగా తీర్పు తెచ్చుకోలేక పోయారు. రాజ‌ధాని విష‌యం నుంచి పంచాయ‌తీ ఎన్నిక‌ల వ‌ర‌కు ఇలానే ఉంది. ఈ నేప‌థ్యంలో ఏజీ స‌రైన వాద‌న‌లు వినిపించ‌లేక పోతున్నార‌నే జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు వైసీపీ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే అంటే.. పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఏజీ మార్పు ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.