Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో అరెస్ట్‌ కు వారెంట్‌ జారీ

By:  Tupaki Desk   |   27 March 2019 12:09 PM GMT
స్టార్‌ హీరో అరెస్ట్‌ కు వారెంట్‌ జారీ
X
కన్నడ స్టార్‌ హీరో కిచ్చ సుదీప్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఈయన తమిళ ఆడియన్స్‌ కు కూడా సుపరిచితుడే. కన్నడంకే పరిమితం కాకుండా తెలుగు, తమిళం, హిందీల్లో కూడా సినిమాలు చేసి బహు బాష నటుడిగా పేరు దక్కించుకున్న సుదీప్‌ చిక్కుల్లో పడ్డాడు. కోర్టు విచారణకు హాజరు అవ్వాల్సిందిగా పలు సార్లు నోటీసులు జారీ చేసినా కూడా ఆయన పట్టించుకోకుండా కోర్టు విచారణకు హాజరు కాక పోవడంతో ఆయన అరెస్ట్‌ కు కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడం జరిగింది.

కన్నడ సినీ వర్గాల్లో సంచలనంగా మారిన ఈ విషయం పూర్తి వివరాల్లోకి వెళ్తే... కొన్నాళ్ల క్రితం సుదీప్‌ తన కిచ్చ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో ఒక సీరియల్‌ ను నిర్మించడం జరిగింది. ఆ సీరియల్‌ షూటింగ్‌ కోసం చిక్కమగళూరుకు చెందిన వ్యాపారి మయూరు ఇంటిని మరియు తోటలను లీజ్‌ కు తీసుకోవడం జరిగింది. షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత మయూరు కు ఇల్లు, తోటను స్వాదీనం చేయడం జరిగింది. అయితే షూటింగ్‌ సమయంలో తన ఇల్లు మరియు తోటను నాశనం చేశారు అంటూ మయూరు ఆరోపణలు చేయడం మొదలు పెట్టాడు.

తన ఇల్లు మరియు తోటను నాశనం చేసినందుకు గాను 1.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కిచ్చ క్రియేషన్స్‌ ను మయూరు కోరాడు. కాని నిర్మాణ సంస్థ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మయూరు కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయమై విచారణకు హాజరు అయ్యి, మీ వివరణ వినిపించాల్సిందిగా కోర్టు పలు మార్లు సుదీప్‌ కు నోటీసులు జారీ చేయడం జరిగింది. కాని నోటీసులకు సుదీప్‌ స్పందించక పోవడంతో చివరకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడం జరిగింది. మరి ఈ అరెస్ట్‌ వారెంట్‌ ను సుదీప్‌ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.