Begin typing your search above and press return to search.

రిస్క్ జోన్ లో చిలసౌ

By:  Tupaki Desk   |   6 Aug 2018 10:58 AM GMT
రిస్క్ జోన్ లో చిలసౌ
X
ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సుశాంత్ చిలసౌ వండర్స్ చేస్తుందేమో అన్న అంచనాలకు భిన్నంగా వెళ్తోంది. సెన్సిటివ్ గా ఉండే ఎమోషనల్ స్టోరీస్ కు పట్టం గట్టే యుఎస్ లో సైతం చిలసౌ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండటం నిర్మాతలకు టెన్షన్ కలిగిస్తోంది. దీనికి ఒకరకంగా గూఢచారి కారణం అని చెప్పొచ్చు. సంబంధం లేని జానర్ అయినప్పటికీ చాలా కాలం తర్వాత ఒక స్టైలిష్ తెలుగు స్పై థ్రిల్లర్ ను చూసేందుకే అక్కడి ప్రేక్షకులు ఓటు వేస్తున్నారు. దీంతో అది కాస్త చిలసౌకు ప్రతికూలంగా మారింది. శనివారం దాకా 89 వేల 700 డాలర్ల దాకా వసూలు చేసిన చిలసౌ బ్రేక్ ఈవెన్ పాయింట్ (లాభం లేదు-నష్టం లేదు) చేరుకోవాలి అంటే కనీసం 2 లక్షల 50 వేల డాలర్లు తేవాలి. కానీ అది అంత ఈజీ కాదు.

మరో మూడు రోజుల్లో నితిన్ శ్రీనివాస కళ్యాణం వచ్చేస్తుంది. ఎలా ఉంటుంది అనే అంచనా పక్కన పెడితే ప్రీ రిలీజ్ బజ్ బాగుంది కాబట్టి విడుదల కూడా దానికి తగ్గట్టుగానే ఉండబోతోంది. సహజంగానే వెనుక వారం సినిమాలు రీప్లేస్ చేయాల్సి వస్తే చిలసౌనే ముందుంటుంది. మరోపక్క 4 లక్షల డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో యుఎస్ లో అడుగు పెట్టిన గూఢచారి అనూహ్యంగా శనివారం లోపే 3 లక్షల 20 వేల డాలర్ల దాకా రాబట్టేసాడు. టాక్ బాగా స్ప్రెడ్ అవడంతో నిన్న ఆ లాంఛనం పూర్తయిపోయుంటుంది కానీ ఆ రిపోర్ట్స్ ఇంకా అందాల్సి ఉంది. అది దాటేస్తే ఇకపై వచ్చేవన్నీ లాభాలే.

కానీ చిలసౌ విషయంలో అది కనిపించడం లేదు. నిన్న బాగానే రాబట్టి ఉంటుంది అనుకున్నా మహా అయితే లక్షన్నర డాలర్లు చేరుకొని ఉండొచ్చు. ఆపై ఇంకా లక్ష డాలర్ల సవాల్ ఉంటుంది. వీక్ డేస్ లో ఇంత మొత్తాన్ని రాబట్టాలి అంటే అంత సులభం కాదు. చూస్తుంటే మంచి సినిమాకు బ్యాడ్ టైం తరహాలో చిలసౌ పది రోజుల్లోపే ముగింపుకు వచ్చేలా ఉంది. రాహుల్ రవీంద్రన్ డెబ్యూ మూవీగా యునానిమస్ టాక్ తెచ్చుకున్న చిలసౌకు ఇలా జరగడం విచిత్రమే.