Begin typing your search above and press return to search.

వీడియో: ఘట్టిగా సెటైరేసిన సుశాంత్!

By:  Tupaki Desk   |   23 July 2018 6:26 AM GMT
వీడియో: ఘట్టిగా సెటైరేసిన సుశాంత్!
X
బైబిల్ లో ఒక సూక్తి ఉంది.. 'తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును'. మరి ఈ కాలంలో హబుల్ టెలిస్కోప్ పెట్టి చూసినా తమను తాము తగ్గించుకునేవాళ్ళెవరూ కనిపించరు కదా! కానీ అది ఫాలో అయ్యేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పెద్దవాళ్ళు పదే పదే మొత్తుకునే 'వినయం.. వినమ్రత'.. ఇలాంటి కాన్సెప్టే! చిత్రంగా సుశాంత్ ఈమధ్యనే ఒక 'గట్టిగా కొడతా' అంటూ రాయలసీమ ఫ్యాక్షనిస్టు తరహాలో టైటిల్ పెట్టి ఒక ప్రమోషనల్ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

గట్టిగా కొడతా అంటే లాగిపెట్టి రెండు చెంపలూ వాయస్తాడని మనం అనుకుంటాం గానీ.. అలా కాకుండా సెన్సిబుల్ గా ఈ జెనరేషన్ ప్రేక్షకులు ఇష్టపడేలా ఈ కాన్సెప్ట్ వీడియో ఉంది. ఇందులో తన మీద ఉన్న రూమర్లన్నిటిపైన సెటైర్లు వేసుకోవడం..కొన్నిటికి ఇండైరెక్ట్ గా సమాధానం ఇవ్వడం మరో హైలైట్. సుశాంత్ 'గట్టిగా కొడతా' అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు అనే వార్తలు ఈమధ్య మీడియా లో గుప్పుమన్నాయి. దీంతో అందరూ ఈ వీడియో ఆ 'గట్టిగా కొట్టే' సినిమా బాపతు వీడియో అనుకున్నారు గానీ.. ఇది 'చి ల సౌ' సినిమా ప్రమోషన్ వీడియో.

అక్కడినుండి స్టార్ట్ అయింది సెటైర్. ఇందులో ఒక దర్శకుడు సుశాంత్ కు కథ చెప్పడానికి వస్తాడు. సుశాంత్ పేరు కు ముందు ఒక బాబు.. చివర ఒక బాబు తగిలించబోతే.. నైస్ గా కట్ చేసి 'బాబొద్దు లేండి.. ప్లీజ్ కాల్ మీ సుశాంత్' అంటాడు. స్టొరీ స్టార్ట్ అయిన దగ్గరనుండి పంచ్ లే పంచులు. ఇంతకీ మీకు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ ఉన్నాడా అని సుశాంత్ అతన్ని అడుగుతాడు.. 'అంటే మీరు ప్రొడ్యూసర్ కాదా?' అంటూ అతను రిప్లై ఇస్తాడు... మీ నాలుగు సినిమాలకు మీరే ప్రొడ్యూసర్ కదా? అంటూ అందరిలానే ప్రశ్నిస్తాడు. తర్వాత ఫ్యామిలీలో ఉండే అన్నీ రిఫరెన్స్ లు విచ్చలవిడిగా వాడేద్దామని చెప్తాడు. అంతలో రాహుల్ రవీంద్రన్ నుండి కాల్ రావడంతో అలా బయటకు వెళ్లి మాట్లాడతాడు. ఫైనల్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'చి ల సౌ' అనే సింపుల్ అండ్ రిలేటబుల్ సినిమా చేస్తున్నానంటూ చెప్తాడు. అప్పుడు అతని రియాక్షన్ వీడియో మొత్తం మీద హైలైట్ .. 'చి ల సౌ' కొరియన్ సినిమానా?' ఇక మీరు ఆలస్యం చేయకుండా వీడియో చూడండి.. లేకపోతే సుశాంత్ మనమీద కూడా ఒక పంచ్ వేసేలా ఉన్నాడు!