Begin typing your search above and press return to search.
చిలసౌ.. అతడికేమైనా పనికొస్తుందా?
By: Tupaki Desk | 12 Aug 2018 4:30 AM GMTగత శుక్రవారం రిలీజైన ‘చి ల సౌ’ మంచి టాక్ తెచ్చుకుంది. టాక్ కు తగ్గట్లుగా వసూళ్లు లేవు కానీ.. తక్కువ బడ్జెట్లో తెరకెక్కించడం వల్ల ఇది హిట్ కేటగిరీలోకి చేరుతున్నట్లే ఉంది. హీరోగా తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న సుశాంత్ కు ఇది ఊరటనిచ్చినట్లే. కానీ ఈ సినిమా అతడికి ఏమేరకు ఉపయోగపడుతుందన్నదే చూడాలి. నిజానికి ఈ చిత్రం అతడి కంటే కూడా దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. హీరోయిన్ రుహాని శర్మలకు ఎక్కువ పేరు తెచ్చిందన్నది వాస్తవం.
పదేళ్లుగా నటుడిగా కొనసాగుతున్న రాహుల్ లో దర్శకుడిగా ఇంత టాలెంట్ ఉందని ఎవరూ అనుకోలేదు. అతను దర్శకుడిగా మారబోతున్నట్లు చెప్పడమే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఏదో మొక్కుబడిగా సినిమా తీస్తాడులే అని లైట్ తీసుకున్నారు. కానీ పరిమిత బడ్జెట్లో మంచి సినిమా తీసి ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి సింపుల్ కాన్సెప్ట్ తో తక్కువ వనరుల్లో సినిమా తీసి మెప్పించడం చిన్న విషయం కాదు. ‘చి ల సౌ’తో ఇప్పటికే అక్కినేని నాగార్జునను మెప్పించి అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. కాబట్టి అతను సూపర్ హ్యాపీ.
ఇక హీరోయిన్ రుహాని శర్మ విషయానికి వస్తే.. నటీనటుల్లో ఎక్కువ స్కోర్ చేసింది ఆమే. తొలి సినిమాలోనే ఏ తడబాటూ లేకుండా నటించింది. ఆమెకు మంచి పాత్ర కూడా దక్కింది. ఒక కొత్త హీరోయిన్ కు ఇలాంటి పాత్ర దక్కడం అరుదే. ఈ అవకాశాన్ని ఆమె పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. తన ప్రతిభ చూపించింది. ఆమెకు మున్ముందు మంచి అవకాశాలే రావచ్చు. సుశాంత్ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా హీరోయిజం చూపించాలని చూసి ఎదురు దెబ్బలు తిన్న అతను.. ఈసారి బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలో మెప్పించాడు. పాత్రకు తగ్గట్లు నటించాడు కానీ.. మరీ ప్రత్యేకమైన ముద్రేమీ వేయలేదు. ‘చి ల సౌ’ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ ఏమీ కాలేదు. సుశాంత్ కు మార్కెట్ కానీ.. ఇమేజ్ కానీ తెచ్చి పెట్టలేదు. కాకపోతే అతను కాస్త నిలబడటానికి పునాది వేసింది. దీని మీద అతను కెరీర్ ఎలా నిర్మించుకుంటాడు.. ఎలాంటి సినిమాలు ఎంచుకుంటాడు.. ఎలాంటి అవకాశాలు అందుకుంటాడన్నది కీలకం.