Begin typing your search above and press return to search.

ఇంతకీ సుశాంత్‌ కు పెళ్ల‌వుతుందా?

By:  Tupaki Desk   |   8 May 2018 5:06 AM
ఇంతకీ సుశాంత్‌ కు పెళ్ల‌వుతుందా?
X
అక్కినేని వంశం నుంచి వ‌చ్చిన హీరో సుశాంత్‌. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చినా... క‌లిసిరాని హీరోల్లో ఇత‌ను ఒక‌డు. కాళిదాసు సినిమాతో 2008లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌రువాత మ‌రో నాలుగు సినిమాలు చేసినా ఒక్క‌సినిమా కూడా థియేట‌ర్లో నిల‌బ‌డ‌లేదు. దీంతో రెండేళ్ల నుంచి ఒక్క సినిమా కూడా లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు మ‌రో క్లాస్ సినిమాతో ముందుకొస్తున్నాడు. ఆ సినిమా అత‌ని పెళ్లి చుట్టే తిరుగుతుంది.

అందాల రాక్ష‌సి ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ కొన్ని సినిమాల‌లో హీరోగా చేసి ఇప్పుడు డైరెక్ట‌ర్ గా మారాడు. అతడే సుశాంత్ హీరోగా చిల‌సౌ అనే సినిమాను తీశాడు. ఆ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చాలా ఫ్రెష్‌గా సినిమాపై ఆస‌క్తి పెంచేలా ఫ‌న్నీగా ఉంది. సుశాంత్‌కు బ్రేకిచ్చే సినిమాలానే అనిపిస్తోంది. ఇందులో సుశాంత్ చిరంజీవి అర్జున్‌గా న‌టిస్తున్నాడు. అత‌నికి స‌ల్మాన్ ఖాన్ అంటే ప‌డిచచ్చేంత ఇష్టం. ఇక ఆంజ‌నేయ‌స్వామి అంటే విప‌రీత‌మైన భ‌క్తి. ఆ ఇద్ద‌రూ బ్ర‌హ్మ‌చారులే క‌నుక సుశాంత్ కూడా పెళ్లి చేసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు. ఇక అత‌ని త‌ల్లి పెళ్లి చేసుకోమంటూ ఒక‌టే పోరు పెడుతుంది. దానికి ఏవేవో కార‌ణాలు చెబుతూ త‌ప్పించుకుంటాడు. చివ‌రికి ఓ అమ్మాయి ప్రేమ‌లో ప‌డ‌తాడు అర్జున్‌. ఎవ‌రా అమ్మాయి? అర్జున్ పెళ్లి అయ్యిందా? అనేదే క‌థ‌. వినోదాత్మ‌కంగా తెర‌కెక్కించారు. టీజ‌ర్ చూస్తే సినిమా చూడాల‌నిపించేలా ఉంది.

ఇందులో సుశాంత్ స్నేహితుడిగా వెన్నెల కిషోర్ క‌నిపిస్తాడు. అత‌డు త‌న‌ను ఒక్క‌మ్మాయి చూడ‌డం లేద‌ని తెగ‌బాధ‌ప‌డుతుంటాడు. వీరిద్ద‌రూ కాంబినేష‌న్లో సీన్లు కూడా వినోదాత్మ‌కంగా ఉన్నాయి. ప్ర‌శాంత్ ఆర్ విహారి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సుశాంత్‌కు హిట్టిచ్చే సినిమాలానే క‌నిపిస్తోంది.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి