Begin typing your search above and press return to search.

'అఖండ'లో చైల్డ్ ఆర్టిస్ట్ దేష్ణ ఫ్యామిలీ ముచ్చట్లు!

By:  Tupaki Desk   |   5 Dec 2021 9:30 AM GMT
అఖండలో చైల్డ్ ఆర్టిస్ట్ దేష్ణ ఫ్యామిలీ ముచ్చట్లు!
X
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో రూపొందిన 'అఖండ' సంచలన విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తమన్ సమకూర్చిన బాణీలు .. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో బేబీ దేష్ణ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆ పాప నటన కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ పాపని ముద్దు చేస్తూ ఉన్న బాలకృష్ణ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ ఆ పాప నటన పట్ల ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

తాజా ఇంటర్వ్యూలో దేష్ణ తో పాటు పేరెంట్స్ మాట్లాడుతూ, ఈ సినిమాకి సంబంధించిన అనుభూతులను పంచుకున్నారు. ఇన్ స్టా ద్వారా ఈ సినిమా నిర్మాతలు మాకు కనెక్ట్ అయ్యారు. పాప విషయం బోయపాటి గారి దాకా వెళ్లడంతో ఆయన సెలెక్ట్ చేశారు. మా పాపకి ఫస్టు ఛాన్స్ ఇంత పెద్ద సినిమాలో రావడం .. బాలకృష్ణ - బోయపాటి వంటి వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం గొప్ప విషయం. బాలకృష్ణగారు దేష్ణతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ .. ఎంతో బాగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు తనకి మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కాదు.

అలాంటి పాపతో యాక్ట్ చేయించడం బోయపాటిగారి గొప్పతనం. ఈ సినిమాలో మా పాపను మరింత అందంగా చూపించారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ద్వారకా ప్రొడక్షన్ టీమ్ వాళ్లంతా కూడా మా పాపని ఎంతో జాగ్రత్తగా .. ప్రేమగా చూసుకున్నారు. వాళ్లు మమ్మల్ని తమ కుటుంబ సభ్యుల మాదిరిగా ట్రీట్ చేశారు. బాలకృష్ణ వంటి ఒక సీనియర్ స్టార్ మా పాప గురించి స్టేజ్ పై గొప్పగా చెప్పినప్పుడు మాకు ఎంతో సంతోషం కలిగింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ లోను మా పాప కనిపిస్తుంది. కానీ ఎప్పుడూ కూడా భయపడలేదు.

బాలకృష్ణ .. బోయపాటి గారు 'ఇదంతా యాక్షన్ మాత్రమే నువ్వలా చూస్తూ ఉండు' అని ఎప్పటికప్పుడు చెబుతుండేవారు. బాలకృష్ణ గారు ప్రతి షాట్ తరువాత వచ్చి మానిటర్ చూసుకునేవారు .. షాట్ ఎలా వచ్చిందా అని. ఆయనతో పాటు దేష్ణ కూడా మానిటర్ చూసుకునేది. మా పాపకి ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినందుకు బోయపాటిగారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బాలకృష్ణగారితో కలిసి నటించే అవకాశం మా పాపకి కలగడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సినిమాతో మా పాపకు ఎంతో గుర్తింపు వచ్చింది. అంతా మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము" అంటూ చెప్పుకొచ్చారు.