Begin typing your search above and press return to search.

పిల్లలు కాదు పిడుగులే

By:  Tupaki Desk   |   14 Nov 2015 4:33 AM GMT
పిల్లలు కాదు పిడుగులే
X
ఒక సినిమా ప్రేక్షకులను మెప్పించాలంటే అందులో హీరోయిజం తప్పకుండా వుండాలన్నది వాస్తవం. అయితే ఆ హీరోయిజం హీరో చేతనేకాక తక్కిన పాత్రలచే పండించి ఖ్యాతిని గడించడం అరుదైన అంశం. వాటిలో బాలల ప్రధాన చిత్రాలకు ప్రత్యేక స్థానం లభిస్తుంది. నేడు బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల ప్రధాన పాత్రలో వచ్చే కొన్ని సూపర్ హిట్ చిత్రాలు నెమరువేసుకుందామా..

కావ్య - లిటిల్ సోల్జర్స్ :

ఇప్పుడు యువతరంలో వున్న ప్రతీ ఒక్కరికీ తమ చిన్నతనంలో విడుదలైన ఈ సినిమా ఒకమధుర జ్ఞాపకం. కేవలం 6 పాత్రలతో అందులో ఇద్దరు పిల్లలతో కధను గుణ్ణం గంగరాజు గారు అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అల్లరి చేసే చిట్టి తల్లి పాత్రలో కావ్య ఓ పక్క అలరిస్తూనే అమ్మానాన్న దూరమైన సందర్భాలలో కంటతడి పెట్టిస్తుంది.

షామిలి - అంజలి:

మణిరత్నం క్రేజ్ పీక్స్ లో వున్న సమయంలో పిల్లలతో సినిమా తీస్తున్నారు అన్న వార్త వినగానే అందరు ఆశ్చర్యపోయారు. సాధారణంగా పిల్లల సినిమా అనగానే నవ్వించడానికి ప్రయత్నిస్తూవుంటారు. కాని మణి 'అంజలి' సినిమాలో ప్రేక్షకుడిని ఎంత ఏడిపించాలో అంతా ఏడిపిస్తాడు. మానసిక రోగురాలిగా షామిలి నటన, ఆమె స్థితిని చూసి రేవతి, రఘువరన్ లు తమలో తాము పడే ఘర్షణ కారణంగా ఈ సినిమా ఎప్పటికీ మనల్ని వెంటాడడం ఖాయం.

సుజాత - పసివాడి ప్రాణం
'యాయ ... యాయ' ఈ సినిమా పేరు వినబడగానే మనకు స్పురించే సౌండ్లు. చిరంజీవి వంటి స్టార్ హీరో కమర్షియల్ కధకు కాస్త క్రియేటివిటీ అద్ది ఒక మూగ బాలుడి ప్రాణం కోసం తపించే చిత్రంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.

తరుణ్ - తేజ

హాలీవుడ్ లో 'హొమ్ ఎలోన్' లాంటి కదాంసానికి తెలుగు నేటివిటీ అద్ది తెరకెక్కిన సినిమా తేజ. బాల నటుడిగా తరుణ్ ఈ చిత్రంతో నంది అవార్డుని అందుకోవడం విశేషం. తన తెలివితేటలతో ప్రత్యర్ధులను ఆటపట్టించే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలం.

నిత్య, నందన్ - దేవుళ్ళు

తమ తల్లిదండ్రులను కలపడంకోసం తాము మొక్కులు తీర్చడానికి పడే తపనని, దానికి దేవుళ్ళు చేసే సహాయాన్ని రసరమ్యంగా ఆవిష్కరించారు కోడి రామకృష్ణ. అప్పట్లో ఈ సినిమా పెను సంచలనంగా నిలిచి భారీ కలెక్షన్లను అందుకుంది.