Begin typing your search above and press return to search.

చిల్ బాస్ అంటూ హాటుగా ప్రగ్యా జైస్వాల్

By:  Tupaki Desk   |   9 Aug 2017 12:33 PM GMT
చిల్ బాస్ అంటూ హాటుగా ప్రగ్యా జైస్వాల్
X
మొదట బాలీవుడ్ లో అడుగుపెట్టి అదృష్టాన్ని పరిక్షించుకున్న భామ ప్రగ్యా జైస్వాల్ అక్కడ నిరాశ దక్కడంతో ప్రస్తుతం సౌత్ సినిమాలపైనే ఏక్కువగా ద్రుష్టి స్టాదిస్తోంది. అయితే రెండేళ్ల క్రితం క్రిష్-వరుణ్ కాంబినేషన్ లో వచ్చిన "కంచె" సినిమా తప్ప ఈ అమ్మడికి ఇంతవరకు ఒక్క సరైన హిట్టు దక్కలేదు. దీంతో నిరాశ చెందకుండా చిన్న తరహా చిత్రాలనైనా సరే ఒప్పుకుంటూ.. వస్తోంది.

అయితే కొన్ని నెలల క్రితం మంచు మనోజ్ తో వచ్చిన గుంటూరోడు సినిమా కూడా ఈ అమ్మడికి ఏ మాత్రం ఛాన్సులు ఇవ్వలేకపోయింది. ఇక ఇలా అయితే లాభం లేదనుకొని తనదైన శైలిలో అందాలను ఆరబోయడానికి సిద్ధమైపోయింది. కంచె సినిమాలో చీరకట్టుతో మిస్టర్ అంటూ పిలిచినా ఈ ముద్దుగుమ్మ ఏకంగా ఇప్పుడు హాట్ లుక్స్ తో ఘాటుగా స్కిన్ షోకి సిద్ధమైపోయింది. రీసెంట్ గా నక్షత్రం సినిమాలో బికినీ వేసి యువకుల మాతో పోగొట్టిన ప్రగ్యా ఇప్పుడు మరో సినిమాతో స్కిన్ షోకి రెడీ అయిపొయింది. మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న "జయ జానకి నాయక" సినిమాలో కూడా ఈ హీరోయిన్ ఘాటుగానే అందాలను ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయినా ఆ చిత్రంలోని పాటలో "చిల్ బాస్ " అంటూ అందాలను ఆరబోసింది. బికినీ టాపుల్లో.. బాడీకి హత్తుకునే లోదుస్తుల్లో.. అమ్మడు హాటు హాటుగా హల్చల్ చేసేసింది.

ఇక జయ జానకి నాయక సినిమాలో రకుల్ పాత్రం రకుల్ ఏడుస్తూ ఉంటె మరో వైపు ఈ భామ ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా స్కిన్ షో తో రెచ్చిపోనుందట. మరి నక్షత్రంలో చూపించిన అందాలనే ఇష్టపడని ప్రేక్షకుడు ఈ సినిమాలో అయినా ఆమె గ్లామర్ షోను ఏ విధంగా చూస్తారో చూడాలి.