Begin typing your search above and press return to search.

మన మీడియాను పిలవలేదే బాహుబలి?

By:  Tupaki Desk   |   2 Jun 2016 5:50 AM GMT
మన మీడియాను పిలవలేదే బాహుబలి?
X
సర్లేండి.. అంటే అన్నాం అంటారు.. కాని అయినవారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో పెడతారనే సామెతను మాత్రం తూచా తప్పకుండా ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం తెలుగు సినిమాలను తీస్తున్న చాలామంది ప్రొడ్యూసర్ల పరిస్థితి ఇదే టైపులో ఉంది. ఇప్పుడు ''బాహుబలి'' దగ్గరకు ఓసారి వెళ్ళొద్దాం.

అసలు బాహుబలి సినిమాకు ఆ రేంజు హైపు తీసుకురావడానికి మీడియా చేసిన కృషి అమోఘం. కేవలం రాజమౌళి ఒక్క ట్వీట్‌ వేస్తే చాలు.. దానిని పట్టుకొని అద్భుతం అంటూ మీడియా చాలా స్టోరీలు రాసింది. శోభు యార్లగడ్డ ఏదైనా ఇంటర్నేషనల్‌ పేపర్లో బాహుబలి ఖ్యాతి ఎలా వర్ధిల్లుందో చూడండి అని రాస్తే చాలు.. వెంటనే దాని గురించి పేపర్లలో స్టోరీలు టివిల్లో కథలు వేసేశారు మనోళ్లు. అయినాసరే ఏనాడూ.. బాహుబలి షూటింగ్‌ లొకేషన్‌ స్పాట్‌ కు వచ్చి.. మొత్తం సెట్‌ అంతా చూసి.. హ్యాపీగా వన్‌ డే అంతా ఎంజాయ్ చేయండి.. అంటూ ఏనాడూ తెలుగు మీడియాను ఇన్వయిట్‌ చేసిందే లేదు.

కాని ఇప్పుడు చైనా నుండి వచ్చిన మీడియా వారిని మాత్రం.. చక్కగా బాహుబలి సెట్‌ కు తీసుకెళ్లి ఒక టూర్ వేయించారు. సినిమా ప్రమోషన్‌ కు ఆ మాత్రం చేయాలి తప్పులేదు.. కాని తెలుగు మీడియా అలాంటి అతిథి సత్కారాలకు ఎందుకు నోచుకోదో బాహుబలి బాబులకే తెలియాలి.