Begin typing your search above and press return to search.

డియర్‌ అయ్యప్ప నన్ను కాపాడు!

By:  Tupaki Desk   |   18 Dec 2019 4:20 PM GMT
డియర్‌ అయ్యప్ప నన్ను కాపాడు!
X
శబరిమలకు మహిళలు వెళ్లాలా వద్దా అనే విషయమై గత కొంత కాలంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు మహిళలకు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనంకు అనుమతించింది. కాని ఇప్పటి వరకు అయ్యప్ప భక్తులు మహిళలను శబరిమల వెళ్లేందుకు ఒప్పుకోవడం లేదు. ఎక్కువ శాతం పంబా వద్దే నిలిపేస్తున్నారు. సుప్రీం కోర్టులో ఈ విషయమై రివ్యూ పిటీషన్‌ వేశారు. ప్రస్తుతం వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ గాయకుడు.. అయ్యప్ప పాటలతో ప్రసిద్ది గాంచిన యేసుదాసు శబరిమలకు మహిళలు ఎందుకు రావద్దు అనే విషయమై మాట్లాడాడు.

ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆడవారు అందంగా తయారు అయ్యి మోడ్రన్‌ డ్రస్‌ లలో వస్తే అయ్యప్ప స్వామి కళ్లు తెరవడు. కాని భక్తులు వారినే చూస్తూ ఉంటారంటూ వ్యాఖ్యలు చేశాడు. అందుకే భక్తుల దృష్టి మరల్చకుండా ఉండాలంటే మహిళ భక్తులు శబరిమల వెళ్లక పోవడం మంచిదంటూ కామెంట్‌ చేశాడు. యేసుదాసు చేసిన వ్యాఖ్యలపై మహిళ సంఘాల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప భక్తులు కూడా ఆయన వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు.

మహిళల గురించి ఏ విషయం వచ్చినా కూడా వెంటనే రియాక్ట్‌ అయ్యే సింగర్‌ చిన్మయి ఈ విషయమై కూడా స్పందించింది. యేసుదాసు వ్యాఖ్యలకు కౌంటర్‌ అన్నట్లుగా చిన్మయి సోషల్‌ మీడియాలో డియర్‌ అయ్యప్ప స్వామి నీ భక్తుల నుండి నన్ను కాపాడు అంటూ ట్వీట్‌ చేసింది. ఆమె ట్వీట్‌ వైరల్‌ అయ్యింది.