Begin typing your search above and press return to search.
నా కూతురిని వైరముత్తు గదిలోకి రమ్మన్నాడు!
By: Tupaki Desk | 12 Oct 2018 10:03 AM GMTబాలీవుడ్ హీరోయిన్ తనూశ్రీ దత్తా తనపై జరిగిన లైంగిక దాడి గురించి మీడియా ముందుకు వచ్చి చెప్పిన నేపథ్యంలో ఆమెను చూసి మరి కొందరు కూడా మీడియా ముందుకు వస్తున్నారు. మరి కొందరు సోషల్ మీడియాలో తమ పట్ల కొందరు చేసిన లైంగిక దాడిని గురించి చెబుతున్నారు. తాజాగా సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టు అయిన చిన్మయి లైంగిక ఆరోపణలతో మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈమె తమిళ ప్రముఖ కవి - లెజెండ్ రైటర్ వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసింది.
వైరముత్తు పైకి కనిపించేంత మంచి వ్యక్తి కాదని - ఆయన నాతో పాటు ఇంకా ఎంతో మంది సింగర్స్ ను లైంగికంగా వేదించాడు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడంతో తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. కొందరు మాత్రం చిన్మయి విమర్శలను కొట్టి పారేస్తున్నారు. పబ్లిసిటీ కోసం చిన్మయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని ఆరోపించిన నేపథ్యంలో తాజాగా చిన్మయి తల్లి పద్మాసిని ఈ విషయమై స్పందించారు.
తన కూతురు చిన్మయి లైంగిక వేదింపులు ఎదుర్కొందని పద్మాసిన పేర్కొన్నారు. ఒక సినిమా ఆడియో వేడుక కోసం 2004వ సంవత్సరంలో స్విట్జర్లాండ్ కు వెళ్లాం. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరిని పంపించి మమ్ములను మాత్రం కొంత సమయం వెయిట్ చేయమన్నారు. నేను చిన్మయి వెయిట్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి మీ కోసం వైరముత్త గారు రూంలో వెయిట్ చేస్తున్నారు, మీరు వెళ్లి కలవండి అంటూ చిన్మయితో అన్నాడు, నన్ను మాత్రం అక్కడే వెయిట్ చేయమని చెప్పాడు. అప్పుడు నేను ఎందుకు ఈ రహస్య కలయిక అంటూ ప్రశ్నించాను. అందుకు కాస్త సహకరించండి అన్నాడు. దాంతో నేను కోపంతో ఆ పనికి మరెవ్వరినైనా చూసుకోండి అంటూ అక్కడ నుండి వెళ్లి పోయాం అంటూ పద్మాసిని చెప్పుకొచ్చారు.