Begin typing your search above and press return to search.
ఆయనపై పగ తీర్చుకుంటుంది
By: Tupaki Desk | 5 Dec 2018 4:22 PM GMTసింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి ఆమద్య మీటూ ఉద్యమంలో భాగంగా తమిళ సినీ ప్రముఖులు అయిన కొందరి పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దాంతో ఆ విషయమై తమిళ సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు తమిళ సినిమా పరిశ్రమ నుండి చిన్మయిని బహిష్కరించాలంటూ డిమాండ్ చేస్తే మరి కొందరు మాత్రం ఆమెకు పూర్తి మద్దతును ఇచ్చారు. ఈ సమయంలోనే ఆమెను డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి తొలగించడం జరిగింది. సంఘంకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించని కారణంగా చిన్మయిని తొలగించినట్లుగా డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ అధ్యక్షుడు రాధారవి ప్రకటించాడు.
శాశ్వత సభ్యత్వం ఉన్న తనను అన్యాయంగా తొలగించారంటూ రాధా రవి పై చిన్మయి పెద్ద యుద్దమే చేస్తోంది. తనను అసోషియేషన్ నుండి తొలగించే హక్కు ఎవరికి లేదు అంటూ న్యాయ పోరాటం కూడా చేసేందుకు సిద్దం అవుతోంది. ఈ సమయంలోనే రాధారవిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. తాజాగా ఆయనపై మరోసారి విరుచుకు పడినది.
మలేషియా ప్రభుత్వం తనకు ‘దత్తో’ అనే బిరుదు ఇచ్చింది అంటూ రాధారవి చెబుతూ వస్తున్నాడు. అరుదైన గుర్తింపు తనకు దక్కిందని రాధారవి ప్రచారం చేసుకుంటున్నాడు. అయితే ఆ బిరుదు నకిలి బిరుదు అంటూ చిన్మయి సాక్షాధారాలతో సహా నిరూపించింది. మలేషియన్ అధికారులకు చిన్మయి దత్తో బిరుదు గురించి సంప్రదించింది. వారు తాము ఎవరికి అలాంటి బిరుదు ఇవ్వలేదని రిప్లై ఇచ్చారు. వాటిని తమిళ మీడియా ముందు చిన్మయి పెట్టింది. ఇంకా పలు రకాలుగా రాధారవిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉంది. మొత్తానికి తనను డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి తొలగించినందుకు గాను రాధా రవిపై పగ తీర్చుకుంటోంది.