Begin typing your search above and press return to search.

ట్రోలర్స్ తాట తీసిన చిన్మయి!

By:  Tupaki Desk   |   29 Oct 2018 10:53 AM GMT
ట్రోలర్స్ తాట తీసిన చిన్మయి!
X
#మీటూ రచ్చ మామూలుగా లేదు. బాలీవుడ్లో ఇప్పటికే పీక్స్ లో ఉంది. సౌత్ విషయానికి వస్తే సింగర్ చిన్మయి లెజెండరీ తమిళ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు గురైన ఇతర బాధితుల తరఫున కూడా మాట్లాడుతోంది. వైరముత్తుకు ఇండస్ట్రీలో .. టీవీ మీడియాలో చాలా సపోర్ట్ ఉంది. కొంతమంది నెటిజనులు కూడా అయనను సపోర్ట్ చేస్తున్నారు.

దీంతో వాళ్ళు చిన్మయిని టార్గెట్ చేయడం కామన్ అయింది. కొందరు పిచ్చి పిచ్చి మీమ్స్ తో చిన్మయిని ట్రోలింగ్ చేస్తున్నారు. చిన్మయి సరిగ్గా బట్టలేసుకోవడం నేర్చుకోవాలని తమిళ భాషలో మీమ్స్ చేస్తూ ట్రోల్ చేయడం ఆమె దృష్టికి వచ్చింది. దీంతో ఆ మీమ్ పై ట్విట్టర్ ద్వారా స్పందించింది. "ఈమధ్య కాలంలో తమిళ సమాజంలోని పురుషులు ఇలాంటి మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఆ తమిళ వాక్యాలకు అర్థం..'ఇలా చీరలు కట్టుకోవాలి. ఇలా ప్రవర్తించాలి అని' కానీ మీరు మాత్రం ఎవరితోనైనా పడుకునేందుకు సై. నేను నా మెడ నొప్పి తగ్గించుకునేందుకు భుజానికి పట్టీ వెసుకున్నాను. అది బ్రా స్ట్రాప్ కూడా కాదు" అంటూ ట్రోలర్స్ ను దులిపి పారేసింది.

ఏదేమైనా ఈ ఫోటోలో చిన్మయి వేసుకున్న డ్రెస్ లో అసభ్యత లేదు. అయినా చిన్మయిని టార్గెట్ చేస్తున్నారంటే ఎవరైనా ఏమని అనుకోవాలి? అందుకే వెధవల సంగేతేమో గానీ చిన్మయి ఇలాంటి పిచ్చి మీమ్స్ పై ఇచ్చిన రిటార్ట్ కి చాలామంది నెటిజనులు మద్దతు తెలిపారు.