Begin typing your search above and press return to search.

ఎందరో వెధవలు.. అంటున్న సింగర్

By:  Tupaki Desk   |   7 Oct 2018 7:47 AM GMT
ఎందరో వెధవలు.. అంటున్న సింగర్
X
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న #మీటూ కాంపెయిన్ లో పలువురు భారతీయ సెలబ్రిటీలు కూడా జాయిన్ అయ్యి తమకెదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నారు. గతంలో ఎవరైనా మహిళలు ఇలా మాట్లాడితే బాధితులను చులకనగా చూడడం జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారుతోంది. వేధింపులకు గురైన వారికి చాలామంది మద్దతుగా నిలుస్తున్నారు.

తాజాగా పాపులర్ సింగర్ - డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద #మీటూ కాంపెయిన్ లో భాగంగా గతంలో తనకెదురైన ఇబ్బందికర సంఘటనలను వివరించింది. చిన్మయి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాలను వెల్లడిస్తూ "నా వయసప్పుడు 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉంటాయి. నేను అప్పుడు నిద్రలో ఉన్నా. మా అమ్మ ఒక డాక్యుమెంటరీ రికార్డింగ్ సెషన్ ను సూపర్వైజ్ చేస్తోంది. అంతలో ఒక ప్రీస్ట్ వస్త్రధారణ లో ఉన్న ఒక అయన నా ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు పెట్టడం నాకు తెలియడం తో మెళకువ వచ్చింది. అమ్మకు 'ఆ అంకుల్ బ్యాడ్ అని చెప్పా'. ఈ సంఘటన జరిగింది శాంతోం కమ్యూనికేషన్స్ అనే స్టూడియోలో ఆ స్టూడియో ఇప్పటికీ ఉంది."

ఇక మరో ట్వీట్ లో "నా వయసప్పుడు 19 ఉంటుందేమో.. మరో సారి చాల్..ఆ..ఆ..ఆ గౌరవప్రదమైన పెద్దవయసు వ్యక్తి ఒక పనిమీద నన్ను తన ఆఫీసుకు పిలిచాడు. మా అమ్మ నాతో అక్కడికి వచ్చింది. కానీ అయన నన్ను ఒక్కదాన్ని లోపలికి పిలిచాడు. అప్పటివరకూ ఆయన మాతో ఎంతో గౌరవంగా ఉండడంతో మాకేమీ అనుమానం రాలేదు. లోపలికెళ్ళగానే నావెనక వచ్చి నన్ను కౌగలించుకున్నాడు. నన్ను పైన తడిమాడు."

ఇంతే కాదు ఆన్లైన్ వేధింపుల గురించి కూడా చిన్మయి వెల్లడించింది. ప్రశాంత్ అనే యూట్యూబ్ రివ్యూయర్ తనకు ఫేక్ సపోర్ట్ ఇస్తూ 'స్వీట్ హార్ట్' అని సంభోదించడంతో అలా పిలవొద్దని చెప్పిందట. అప్పటినుండి చిన్మయికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడట.