Begin typing your search above and press return to search.

రేప్ చెయ్యడం నాట్ ఓకె.. బ్యాన్ చెయ్యండి

By:  Tupaki Desk   |   7 March 2017 11:00 AM GMT
రేప్ చెయ్యడం నాట్ ఓకె.. బ్యాన్ చెయ్యండి
X
సోషల్ మీడియాలో ఎకౌంట్ ఉంటే చాలు..ఎవరు ఏది పడితే అది మాట్లేడేస్తున్న రోజులు ఇవి. నోటికి హద్దూ పద్దూ ఏమీ ఉండట్లేదు. అయితే వారి కామెంట్ల వలన అవతల వారు ఎంతగా హర్టు అవుతున్నారో తెలుసా?

సింగర్ చిన్మయి మనకు సుపరిచితురాలే. ముఖ్యంగా సమంతకు రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పే అమ్మాయిగా టాలీవుడ్ లో ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. అయితే ఈమె ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. రకరకాల విషయాలపై తన ఒపీనియన్ చెబుతుంటుంది. డిబేట్లు కూడా చేస్తుంటుంది. అలాంటి సమయాల్లో ఆమెకు చాలానే వార్నింగులు వస్తున్నాయట. కొందరు రేప్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తే.. కొందరు యాసిడ్ పోస్తామని.. తన గొంతును మూగబోయేలా చేస్తామంటూ ఆమెను నీచంగా హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై ట్విట్టర్ వారికి కంప్లయింట్ ఇస్తే.. వారు పెద్దగా పట్టించుకోవట్లేదట.

అందుకే ఇప్పుడు రేప్ చెయ్యడం నాట్ ఓకె.. #RapeThreatsNotOk.. అంటూ చిన్మయి ఒక ఆన్ లైన్ క్యాంపెయిన్ మొదలెట్టింది. ఎక్కువమంది ఈ క్యాంపెయిన్ కు సపోర్టుగా నిలిస్తే.. ట్విట్టర్ పై ప్రెజర్ తీసుకొచ్చి.. అలాంటి రేప్ హెచ్చరికలను జారీ చేసినవారి ఎకౌంట్ ను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయొచ్చు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/