Begin typing your search above and press return to search.
ఆ కుక్క పిల్లపై ప్రేమ చూపిస్తున్న సింగర్
By: Tupaki Desk | 8 July 2016 4:40 AM GMTగతంలో సినిమా వాళ్లంటే మెటీరియలిస్టులు అనే ఫీలింగ్ చాలామందికి ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా.. ఇలాంటి భావాల్లో మార్పులు వస్తున్నాయి. వారిలో సున్నితమైన మనసున్న వారు ఎంతమంది ఉంటున్నారో జనాలకు బాగానే తెలుస్తోంది. ఇప్పుడు సింగర్ చిన్మయి శ్రీపాద తీసుకున్న ఓ నిర్ణయం.. చాలామందికి స్ఫూర్తిని కలిగిస్తోంది.
భద్ర అనే కుక్క పిల్ల ఒకటి రీసెంట్ గా వార్తల్లో నానుతోంది. నెలల వయసు మాత్రమే ఉన్న ఈ చిన్నారి డాగీని.. ఓ బిల్డింగ్ ని విసిరేశాడు ఫైనలియర్ చదువుతున్న మెడికో. అతడి చర్యపై విపరీతంగా విమర్శలు చుట్టుముట్టాయి. ఆన్ లైన్ లో కూడా ఈ వీడియో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఈ కుక్కపిల్ల కాలికి గాయంతో బతికి బయటపడగా..శ్రవణ్ కృష్ణ అనే వ్యక్తి ప్రస్తుతం పెంచుకుంటున్నాడు. ఇకపోతే ఈ చిన్నారి డాగ్ ను దత్తత తీసుకునేందుకు సింగర్ చిన్మయి ముందుకొచ్చింది.
భద్రాను దత్తత తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా చెప్పిన చిన్మయి.. ప్రస్తుతం తాము ఓ కుక్కను పెంచుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పుడు భద్రాను ఇంటికి తీసుకెళ్లడం ద్వారా.. తమ పెంపుడు కుక్కకు ఇది తోడు ఉంటుందని చెప్పింది చిన్మయి. మొత్తానికి ఈ చిన్నారి కుక్క బతికడమే ఆశ్చర్యం అయితే.. అది భద్ర.. భద్రంగా చిన్మయి దగ్గరకు చేరనందన్న మాట.