Begin typing your search above and press return to search.

సమంత భయంతోనే ఏడిపిస్తుందట

By:  Tupaki Desk   |   22 Sept 2017 3:05 PM IST
సమంత భయంతోనే ఏడిపిస్తుందట
X
దెయ్యాల సినిమాలకు ఈ రోజుల్లో బాగానే పాపులారిటీ ఉంది. భయం అనే థ్రిల్ ను ప్రేక్షకుడు ఎప్పుడైనా ఇష్టపడతాడు. కొత్తగా భయపెట్టే ఆలోచనతో వస్తే సినిమాకు కాసుల వర్షం కురుస్తుంది. కానీ కొన్ని సినిమాలు రోటిన్ గా వస్తే లెక్క చేయడం లేదు. కథ బావుంటే బడా హీరోలు కూడా హర్రర్ సినిమాలకు రెడీ అంటున్నారు. టాలీవుడ్ హీరో నాగార్జున కూడా "రాజు గారి గది 2" రాబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలోని ఒక తెలియని విషయం ఇప్పుడు బయటపడింది. సమంత గత చిత్రాలకు బిన్నంగా ఈ సినిమాలో కనిపించనుందట. ఆమె దెయ్యంగానే కనిపించనుందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. కానీ ఈ సినిమాలో ఎంత బయపెడుతుందో అంతకంటే ఎక్కువ ఏడిపిస్తుందట. సమంత ప్రతి సినిమాకు డబ్బింగ్ చెప్పే చిన్మయి ఈ విషయాన్నీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. సినిమాలో సమంత చాలా బాగా నటించింది. తను పెర్ఫామెన్స్‌తో చంపేస్తుందంతే అంటూ తనదైన శైలిలో కామెంట్ చేసింది.

అలాగే ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పేటప్పుడు చిన్మయి చాలా ఏడ్చేసిందట. అంటే ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయని చెప్పేవచ్చు. ఇక బాధతో పగను పెంచుకున్న దెయ్యం పాత్రలో సమంత థియేటర్స్ లో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఆ దెయ్యాన్ని నాగ్ తన శక్తితో ఎలా కంట్రోల్ చేస్తాడన్నది ప్రధానాంశం. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళికి అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది