Begin typing your search above and press return to search.

ఆ బాధ మగాళ్లకూ తప్పలేదు

By:  Tupaki Desk   |   17 Oct 2017 5:03 AM GMT
ఆ బాధ మగాళ్లకూ తప్పలేదు
X
సాధారణంగ మేల్ డామినేటెడ్ సొసైటీ మనది. పై స్థాయిలో ఉన్న మగాళ్లు తమ కింద పనిచేసే మహిళలను లైంగికంగా వేధించినా డబ్బు.. పరపతి.. పలుకుబడి వంటి వాటి కారణంగా ఇలాంటివి వెలుగులోకి వచ్చేది తక్కువే. సినిమా లాంటి గ్లామర్ ఇండస్ట్రీలో అయితే సెక్సువల్ వేధింపులు ఎక్కువే ఉంటాయనేది బహిరంగ రహస్యమే. వేధింపులకు గురయిన వారిలో సైలెంట్ గా ఉండేవాళ్లే ఎక్కువ.

ఈ మధ్య హాలీవుడ్‌ నిర్మాత హార్వే వైన్‌ స్టైన్‌ పలువురు నటీమణులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు వైరల్ అయ్యాయి. దీనిపై హాలీవుడ్‌ యాక్టర్ అలిస్సా మిలానో ట్విటర్‌ లో ‘మీటూ’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో ప్రచారం స్టార్ట్ చేసింది. దీనికి చాలామంది స్పందించి తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలు షేర్ చేసుకున్నారు. దీనిపై సింగర్ చిన్మయి మాత్రం చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అయింది. ‘‘అవతల వారు సెక్సువల్ గా వేధిస్తుంటే కలిగే బాధ చెప్పనలవి కాదు. వేధింపులు ఎదుర్కోని అమ్మాయే ఉండదు. అంతెందుకు... నా స్నేహితులైన కొందరు మగవారిని వారి కంటే వయసులో పెద్దవారైన పురుషులు లైంగికంగా వేధించారు’’ అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నిజమే.. వేధింపులు ఎవరినైనా మానసికంగా కృంగదీస్తాయి. ఈ విషయంలో అమ్మాయిలతోపాటు అబ్బాయిలు బాధలు పడినా ఎవరూ ఆ విషయమే ఎత్తరు. చిన్మయి మాత్రం మగవాళ్లకు సపోర్ట్ గా మాట్లాడటం చాలామందికి నచ్చింది. అందుకే నెటిజన్లు చాలామంది ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు.