Begin typing your search above and press return to search.
స్టార్ రైటర్ చెంప చెల్లుమనిపిస్తా!
By: Tupaki Desk | 13 April 2019 4:57 AM GMTతమిళ సీనియర్ లిరిసిస్ట్ వైరముత్తుతో గాయని చిన్మయి శ్రీపాద వివాదం గురించి తెలిసిందే. ఏడాది కాలంగా ఆ ఇద్దరి మధ్యా గొడవ అంతకంతకు రచ్చకెక్కుతోంది. దాదాపు పదేళ్ల కిందట వైరముత్తు తనను లైంగికంగా వేధించారని చిన్మయి బహిరంగంగానే మీడియాకి వెల్లడించడంతో అసలు రచ్చ మొదలైంది. విదేశాల్లో ఓ ఈవెంట్ కి వెళ్లినప్పుడు తనని గదికి రమ్మని పిలిపించాడని చిన్మయి మీటూ క్యాంపెయినింగ్ వేదికగా ఆరోపించారు. దానిపై విచారణ సాగాలని చిన్మయి మీడియకి ఎక్కారు. ఈ విషయంలో తన భర్త రాహుల్ రవీంద్రన్ సైతం తనకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్మయి బహిరంగ ఆరోపణల అనంతరం వైరముత్తు లీలలపై పలువురు మహిళలు మీడియాకెక్కడం ప్రముఖంగా చర్చకు వచ్చింది.
అయితే చిన్మయి ఆరోపణలు సత్యదూరం అంటూ వైరముత్తు మీడియా ముందు ఖండించారు. తన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఖండించడంతో ఆయన అభిమానులు సైతం ఇంత ఆలస్యంగా స్పందించారేం? పదేళ్ల క్రితమే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అంటూ చిన్మయిని ప్రశ్నించారు. ఈ వివాదం ఇప్పటికీ సద్ధుమణగలేదు. పలు వేదికలపై చిన్మయి తనకు జరిగిన అన్యాయం గురించి వాపోతూ వైరముత్తును ఎండగట్టే ప్రయత్నం చేయడం చర్చకొచ్చింది. సంఘంలో గౌరవం ఉన్న వ్యక్తిపై ఆరోపించే ధైర్యం లేకనే అప్పట్లో అలా చేయలేకపోయానని - మీటూ వేదిక తనకు అప్పట్లో అందుబాటులో లేదని చిన్మయి వివరణ ఇచ్చారు.
తాజాగా మరోసారి చిన్మయి శ్రీపాద సదరు సీనియర్ లిరిసిస్టుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ నెటిజనుతో జరిగిన సంభాషణలో ``ఈసారి వైరముత్తు కనిపిస్తే చెంప చెల్లుమనిపిస్తాను`` అంటూ వ్యాఖ్యానించడం సంచలనమైంది. అయితే తాను అలా వ్యాఖ్యానించడానికి కారణం సదరు అభిమాని ఖుష్బూ సుందర్ ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపిస్తున్న వీడియో గురించి ప్రస్థావించడమే. కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ ఎన్నికల క్యాంపెయినింగ్ లో ఉండగా గుంపులో ఉన్న ఒక వ్యక్తి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నిస్తుండగా తన చెంప చెల్లుమనిపించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే వైరల్ అయ్యింది.
``ఈ మాటలు కేవలం చిన్మయి కోసం మాత్రమే.. మగువలతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తికి ఖుష్బూ మేడం సరిగ్గా బుద్ధి చెప్పారు`` అంటూ సదరు వ్యక్తి సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అందుకు ప్రతిగా స్పందిస్తూ.. ``కచ్చితంగా.. ఈ సారి నాకు వైరముత్తు కనిపిస్తే తప్పకుండా చెంప చెళ్లుమనిపించాలన్న విషయం గుర్తు పెట్టుకుంటా. నా విషయంలో ఇలానే న్యాయం జరిగేలా ఉంది`` అని చిన్మయి ఆమె వ్యాఖ్యానించారు. చిన్మయి తాజా వ్యాఖ్యలకు మరోసారి వైరముత్తు అభిమానుల ప్రతిస్పందన ఎలా ఉండనుందో!!