Begin typing your search above and press return to search.

సమోసాలో ఆలూ ఉన్నట్లు.. సమంతకు నేనే

By:  Tupaki Desk   |   1 Sep 2016 4:46 AM GMT
సమోసాలో ఆలూ ఉన్నట్లు.. సమంతకు నేనే
X
టాలీవుడ్ మూవీస్ వరకు సమంత టాప్ హీరోయిన్. అందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఆన్ స్క్రీన్ పై సమంతను ఉంటే చాలు.. అభిమానులు థియేటర్లకు బారులు తీరేస్తున్నారు. ఇంతగా అమ్మడికి క్రేజ్ రావడానికి కారణం.. శామ్స్ డైలాగ్స్ చెబుతుంటే వినిపించే వాయిస్ కూడా. సమంతకు మొదటి నుంచి చిన్మయి డబ్బింగ్ చెబుతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు జనతా గ్యారేజ్ రిలీజ్ సందర్భంగా సమంతకు బెస్టాఫ్ లక్ చెప్పింది చిన్మయి. 'జనతా గ్యారేజ్ రిలీజ్ సందర్భంగా శామ్ పాపకి బెస్టాఫ్ లక్. ఓ నానుడి మాదిరిగా సమోసాలో ఆలూ ఉన్నంత వరకు.. తెలుగులో శామ్ కి నేనే డబ్బింగ్ చెబుతాను' అంటూ ట్వీట్ చేసింది చిన్మయి శ్రీపాద. ఈ ట్వీట్ పడ్డ కొన్ని నిమిషాల్లోనే 'హహ.. మ్.. థ్యాంక్స్ పాపా' అంటూ నాలుగు ముద్దులు పోస్ట్ చేసి మరీ తన సంతోషాన్ని కృతజ్ఞతలను రీట్వీట్ చేసింది శామ్స్.

ఇద్దరి అనుబంధం ఈ రేంజ్ లో ఉండడంతోనే.. సినిమాల్లో సమంత కేరక్టర్ ఆ స్థాయిలో పండుతోంది. ఆన్ స్క్రీన్ పై సమంత ఎంత ముఖ్యమో.. ఆమె పాత్రకు ఆఫ్ స్క్రీన్ లో చిన్మయి డబ్బింగ్ చెప్పడం అంత ఇంపార్టెంట్. అలా వీరి రిలేషన్ సమసా- ఆలూ అయిపోయిందన్న మాట. ఈ లెక్కన సమంత సమోసా.. చిన్మయి ఆలూ అన్నమాటేగా.