Begin typing your search above and press return to search.

చిన్మయి వెర్షన్ కరెక్టే కానీ..

By:  Tupaki Desk   |   6 Oct 2017 11:06 AM GMT
చిన్మయి వెర్షన్ కరెక్టే కానీ..
X
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తను మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి అన్న సంగతి తెలిసిందే. దీనికి పవన్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడం.. ఆమె దానిపై క్లారిటీ ఇవ్వడం.. ఆ విషయం సద్దుమణగడం జరిగాయి. కానీ మళ్లీ ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణం సింగర్ చిన్మయి. నేరుగా రేణూ పేరు ప్రస్తావించకపోయినా.. రేణూ దేశాయ్ అపాలజీ చెప్పాల్సిన పరిస్థితి రావడాన్ని.. క్లారిటీ ఇవ్వడాన్ని చిన్మయి ప్రస్తావించింది.

సోషల్ మీడియాలో మహిళల పరిస్థితిని చిన్మయి గుర్తు చేసింది. తనకు జరిగిన విషయాన్ని కూడా ఇందులోకి లాగింది చిన్మయి. నేరుగా చెప్పకపోయినా.. సుచీలీక్స్ ను ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావిస్తూ 'మార్చ్ 2017 నుంచి నేను ఇలా వేధింపులకు గురయ్యాను. ఇది వేరే విషయమే. కానీ ఒకే విషయంపై ఎంతగా వేధింపులకు గురి చేస్తారో అనుభవించాను. నేను మరింత స్ట్రాంగ్ అయేందుకు ఈ సంఘటన ఉపయోగపడింది' అని చెప్పింది చిన్మయి. అయితే.. రేణూ దేశాయ్ విషయంలో రియాక్ట్ అయింది పవన్ ఫ్యాన్స్ మాత్రమే. కానీ చిన్మయికి సోషల్ మీడియా వ్యాప్తంగా మాటలు వచ్చాయి.

ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి లింక్ అయిన సంఘటనకు దానికి ముడి పెట్టడంతో.. చిన్మయిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ క్లారిటీ ఇచ్చాడు. 'చిన్మయికి సార్ అంటే ఎంతో గౌరవం. అలాంటి మనిషి ఆయనను ఎందుకు విమర్శిస్తుంది. అసలు తను చెప్పిన విషయంలో సార్ కి ఎలాంటి లింక్ లేదు' అంటూ పవన్ పేరు చెప్పకుండానే.. తమకు ఆయనంటే ఎంతో గౌరవం అని చెప్పాడు రాహుల్ రవీంద్రన్.