Begin typing your search above and press return to search.
హార్వీ వర్సెస్ వైరముత్తు...చిన్మయి ట్వీట్ వైరల్
By: Tupaki Desk | 12 March 2020 2:33 PM GMT# Me Too.....కొద్ది నెలల క్రితం ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపిన పదం ఇది....హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్....ఇలా అన్ని సినీ ఇండస్ట్రీలను ఓ కుదుపు కుదిపేసని ఉద్యమం ఇది. సోషల్ మీడియాలో ఈ పదం ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఒక్క సినీ ఇండస్ట్రీనే కాదు...పొట్టకూటి కోసం ఇళ్లలో పనిచేసేందుకు వెళ్లిన మెయిడ్ ల దగ్గర నుంచి పేరుపొందిన మహిళా రాజకీయ నేతల వరకు ఈ మీటూ ఉద్యమంలో కదం తొక్కారు. బాలీవుడ్ లో నానాపటేకర్ పై ఆరోపణలతో తనూ శ్రీ దత్తా మీటూ అనగా...దక్షిణాదిలో ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఈ ఉద్యమాన్ని తన భుజాన వేసుకున్నారు. తాజాగా, ఈ ఉద్యమానికి మూల కారకుడైన ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్ స్టీన్ కు 23 ఏళ్ల కారాగార శిక్ష పడిన నేపథ్యంలో చిన్మయి వ్యంగ్యంగా స్పందించారు. హార్వీకి గనక భారత్ లో పుట్టి ఉంటే....ముఖ్యంగా తమిళనాడు లో పుట్టి ఉంటే...ఈ పాటికి రాజకీయ నాయకుల తో కలిసి పార్టీ చేసుకునే వాడని...ఇలా జైలుకు వెళ్లేవాడు కాదని చిన్మయి సెటైరికల్ ట్వీట్ చేశారు. హార్వీ పై చిన్మయి సెటైరికల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హార్వీకి శిక్ష పడిన నేపథ్యంలో భారత రాజకీయ పార్టీలు, నాయకులపై చిన్మయి సెటైరికల్ ట్వీట్స్ చేశారు. తాను భారత్ లో జన్మించి ఉంటే బాగుండేదని హార్వీ కోరుకుని ఉంటాడని, ముఖ్యంగా తమిళనాడులో పుట్టాలని బలంగా అనుకుని ఉంటాడని చిన్మయి ట్వీట్ చేశారు. ఒకవేళ హార్వీ ఇక్కడ పుట్టినట్లయితే...స్టార్లు, రాజకీయ నాయకుల తో సంతోషంగా పార్టీలు చేసుకునేవాడని...పద్యాలు, కవితలు రాసుకునేవాడని వ్యంగ్యంగా వైరముత్తుపై పరోక్ష విమర్శలు గుప్పించారు. హార్వీ ఇక్కడి వాడై ఉండి ఉంటే 100 శాతం రాజకీయపార్టీలు ఆయనకే మద్దతుగా నిలిచేవని ట్వీట్ చేశారు. దీంతోపాటు, హార్వీ వర్సెస్ వైరముత్తు అంటూ హార్వీ వెయిన్‌స్టీన్, వైరముత్తుకు సంబంధించిన వార్తా కథనాల క్లిప్పింగ్ లను చిన్మయి షేర్ చేశారు.
కాగా, వైరముత్తుపై తనతోపాటు, మరికొందరు మహిళల ఆరోపణల నేపథ్యంలో తనపై ఇండస్ట్రీలోని పెద్దలు కొందరు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని చిన్మయి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.