Begin typing your search above and press return to search.
ఆ ఫొటోలు ఫేక్ అంటూ సాక్ష్యం చూపించింది
By: Tupaki Desk | 27 Nov 2019 6:13 AM GMTగత ఏడాది కాలంగా సింగర్ చిన్మయి శ్రీపాద గురించి మీడియా లో తరుచు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఆమె తమిళ లెజెండ్రీ రైటర్ వైరముత్తు గురించి మీటూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. అంతటితో ఆగకుండా కోలీవుడ్ స్టార్స్ పై కూడా ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా చాలా కాలంగా మీడియా లో ఉంటూ వస్తున్న చిన్మయి శ్రీ పాద పై సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు ట్రోల్స్ మరియు మీమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా చిన్మయికి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివాదాస్పద బాబా పలు కేసులు ఉన్న స్వామీ నిత్యానంద వద్ద ఈమె ఆశీర్వాదం తీసుకుంటున్నట్లుగా... ఈమె ఆయన భక్తురాలు అని.. ఆయనతో సంబంధం ఉందంటూ పిచ్చి పిచ్చి పుకార్లను కొందరు స్ఫ్రెడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా లో నిత్యానంద మరియు చిన్మయిల ఫొటో వైరల్ అయ్యింది. చాలా మంది ఆమెను ప్రశ్నిస్తున్న నేపథ్యం లో ఆమె స్వయంగా స్పందించింది. సాక్ష్యాధారాలతో సహా పోస్ట్ చేసి ఆ ఫొటో నిజం కాదని చెప్పింది.
చిన్మయి రెండు ఫొటోలను పోస్ట్ చేసి అందులో వేరు వేరుగా తాను మరియు నిత్యానంద ఉన్నట్లుగా చెప్పింది. ఆ రెండు ఫొటోలను ఎవరో కావాలని మార్ఫింగ్ చేసి ఇలా ప్రచారం చేస్తున్నారంటూ వాపోయింది. కొందరు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. వారికి ఇదేమైనా ఆనందాన్ని ఇస్తుందా అంటూ ఆమె ప్రశ్నించింది. ఆ ఫొటోను పోస్ట్ చేసిన వ్యక్తిని ట్యాగ్ చేసి మీరు ఇలా ఫ్రీగా చేస్తున్నారా లేదంటే డబ్బులు తీసుకుంటన్నారా అంటూ ప్రశ్నించింది.