Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: తమిళ వాసన ఎక్కువైందే
By: Tupaki Desk | 7 July 2018 4:32 AM GMTఅన్నయ్య సూర్య బాటలోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు తమిళ కథానాయకుడు కార్తి. మధ్యలో కొంచెం ట్రాక్ తప్పినా.. ‘ఊపిరి’.. ‘ఖాకి’ సినిమాలతో మళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడతను ‘చినబాబు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తి రైతు పాత్రలో నటించిన సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ వచ్చింది. ఇప్పుడు సినిమా విడుదల దగ్గర పడుతుండగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఆ ట్రైలర్ వినోదాత్మకంగా బాగానే అనిపిస్తోంది. కానీ అందులో తమిళ వాసనలు బాగా ఎక్కువైపోయాయి. అర్బన్ బేస్డ్ సినిమాలైతే నేటివిటీ అనేది పెద్దగా ఇబ్బంది కాదు. పైగా కార్తి కూడా తెలుగు ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని మరీ నేటివిటీ ఫ్యాక్టర్ ఎక్కువ లేకుండా జాగ్రత్త పడుతుంటటారు.
కానీ తమిళ రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలైతే మాత్రం అక్కడి ఫిలిం మేకర్లు బాగా లోకల్ మసాలా దట్టించేస్తారు. ‘చినబాబు’ విషయంలోనూ అదే జరిగింది. కార్తి కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయినట్లున్నాడు. ట్రైలర్లో ప్రతి ఫ్రేమ్ లోనూ తమిళ వాసనలు గుప్పుమంటున్నాయి. అక్కడి పల్లెటూళ్లు.. అక్కడి మనుషులు.. సంప్రదాయాల్ని చూపించే ప్రయత్నం జరిగినట్లుంది. ఐతే సినిమా అంతా కూడా కలర్ఫుల్ గా ఉంటుందని.. రైతు కథ కదా అని సీరియస్ గా ఏమీ ట్రై చేయలేదని.. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కార్తి కామెడీతో పాటు యాక్షన్ కూడా ట్రై చేసినట్లున్నాడు. రైతు పాత్రకు అతను బాగానే సూటయ్యాడు. ఈ సినిమాలో తెలుగు నటుడు శత్రు విలన్ పాత్రలో కనిపించడం విశేషం. ‘అఖిల్’ హీరోయిన్ సాయేషా పల్లెటూరి అమ్మాయిగా కొత్తగా కనిపిస్తోంది. కార్తితో ఆమె కెమిస్ట్రీ బాగానే వర్కవుటైనట్లుంది. పరోటా సూరి కామెడీ కూడా ఓకే అనిపిస్తోంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 13న తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.