Begin typing your search above and press return to search.
సాంగ్ రివ్యూ: చిన్నతనమే చేర రమ్మంటోంది
By: Tupaki Desk | 13 Dec 2019 4:33 AM GMTసాయి తేజ్ నటిస్తున్న తాజా చిత్రం `ప్రతిరోజు పండగే`. మారుతి దర్శకుడు. యువీ క్రియేషన్స్ సమర్పణలో జీఏ2 అధినేత బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాశిఖన్నా టిక్ టాక్ సుందరిగా అలరించనుంది. సత్యరాజ్ ఈ చిత్రంలో సాయి తేజ్ కు తాతగా కనిపించనున్నారు. ఆయన పాత్రే ఈ చిత్రానికి ప్రధాన బలం కానుందని ఇంతకుముందు టీజర్ రివీల్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. తాజాగా మరో లిరికల్ సాంగ్ వీడియోని రిలీజ్ చేశారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాట ప్రతీ ఒక్కరికి తమ చిన్నతనాన్ని గుర్తుచేయడం ఖాయం. తమన్ సంగీతం అందించిన ఈ పాటని జేసుదాసు తనయుడు విజయ్ ఏసుదాసు ఆలపించారు. `చిన్నతనమే చేరరమ్మంటే.. ప్రాణం నిన్నవైపే దారితీస్తోందే...అడుగుతై ఎదరికైనా నడకమాత్రం వెనకకే.. గడిచిపోయిన జ్ఞాపకాలతో గతము ఎదురౌతున్నదే...`` అంటూ సాహిత్య సవ్యసాచి సిరివెన్నెల కలం నుంచి జాలువారిన పదాలు చిన్ని తనంలోని మాధుర్యాన్ని.. మధుర జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చేలా వున్నాయి. ఈ సాహిత్యానికి తోడు తమన్ సంగీతం కూడా తోడవ్వడంతో పాటకు మరింత ప్రాణం పోసినట్టయింది.
లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథాంశాన్ని ఎంచుకుని బంధాలు అనుబంధాలు నేపథ్యంలో `శతమానం భవతి` తరహాలో మరో ప్రయత్నమిదని టీజర్ చూశాక అర్థమైంది. మారుతికి ఈ తరహా కొత్త అనే చెప్పాలి. `ప్రతిరోజు పండగే` ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత కొంత కాలంగా సరైన విజయాల్ని సొంతం చేసుకోలేక రేసులో వెనకబడ్డ సాయి తేజ్ `చిత్రలహరి`తో మళ్లీ ట్రాక్ లోకెక్కారు. ఈ సినిమాతో తన విజయాల పరంపరను కొనసాగించాలని భావిస్తున్నారు. కథ- కథనాలు.. తమన్ సంగీతం ఈ చిత్రాన్ని విజయతీరాలకు చేరేందుకు సాయం అవుతున్నాయనే చెప్పాలి. సాయితేజ్ విజువల్ బ్రిలియన్సీ.. రాశీ గ్లామర్ . సత్యరాజ్ సీనియారిటీ అస్సెట్ కానున్నాయి.