Begin typing your search above and press return to search.
చౌదరికి మెంటల్ అంటున్న రైటర్
By: Tupaki Desk | 17 July 2016 9:30 AM GMTటాలీవుడ్ లో తారా చౌదరి వ్యవహారం ఓ సంచలనం. హైటెక్ వ్యభిచార అడ్డా నిర్వహించేదనే ఆరోపణలు వచ్చాయి. ప్రముఖులతో దిగిన ఫోటోలు చూపించి బ్లాక్ మెయిలింగ్ చేసినట్లగా కూడా ఆరోపణలున్నాయి. ఆ సమయంలో తారా చౌదరి తాను నరకయాతన అనుభవించానంటూ ఓ అమ్మాయి మీడియాకెక్కడంతో.. రచ్చరచ్చ అయింది. అప్పట్లో తారా చౌదరి రైటర్ చిన్నికృష్ణపై ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది.
ఓ ఇంటర్వ్యూలో అప్పటి గొడవపై చిన్నికృష్ణ స్పందించాడు. ' పాపం ఆ అమ్మాయి మెంటల్లీ ఇన్ బ్యాలెన్స్. ఆ తర్వాత కూడా చాలా సార్లు అరెస్టయింది. ఓ బాధ్యత గల వ్యక్తిగా.. ఓ బ్రదర్ గా.. తను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. నాకు నాకా అమ్మాయిపై ఎటువంటి కోపం లేదు' అన్నాడు చిన్నికృష్ణ. తారా చౌదరిపై ఆరోపణలు వచ్చినపుడు.. ఈ కేసులోకి చిన్నికృష్ణను లాగిందామె. ఈమేరకు కోర్టులో వాదనలు కూడా నడిచాయి.
చిన్ని కృష్ణకు తారాచౌదరి భారీగా డబ్బులు ఇచ్చిందని, వాటిని అతను తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆమె తరఫు లాయర్ కోర్టులో వివరించాడు. అయితే.. చిన్న కృష్ణతో రాజీ కుదుర్చుకోవాలని పోలీసులు తారా చౌదరికి సూచించారని, దీనికామె నిరాకరించడంతోనే.. చిన్నికృష్ణ ఆమెను కేసులో ఇరికించాడని కోర్టులో వాదనలు జరిగాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ వివాదంపై మాట్లాడిన చిన్నికృష్ణ.. ఆమెపై జాలి చూపడం విశేషమే.