Begin typing your search above and press return to search.
చిరు 150 జిరాక్స్ కాపీ అంటున్న చిన్నికృష్ణ
By: Tupaki Desk | 17 July 2016 5:05 AM GMTచిరంజీవి తన 150వ సినిమాగా ఓ తమిళ రీమేక్ ను ఎంచుకోవడం పట్ల ఒకరకమైన నిరాశ వ్యక్తం చేశాడు రచయిత చిన్నికృష్ణ. చిరు 150 కోసం తనను కథ అడిగారని.. అయితే తాను రాసిన కథను కాదని ‘కత్తి’ రీమేక్ ను చిరు ఎంచుకున్నాడని చిన్నికృష్ణ అన్నాడు. తాను మూడేళ్ల పాటు కష్టపడి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కోసం ఓ స్క్రిప్టు రాసినట్లు కూడా వెల్లడించాడతను. ఒకప్పుడు నరసింహా.. నరసింహనాయయుడు.. ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చి.. ఇప్పుడు ఖాళీ అయిపోయారేంటి అని అడిగితే.. తనదైన శైలిలో స్పందించాడు చిన్నికృష్ణ.
‘‘అవకాశాలు రాకేం కాదు. ప్రతి నెలా ఎవరో ఒక నిర్మాత వస్తారు. ఇంతకు ముందు పని చేసిన హీరోల నుంచి పిలుపులొస్తూనే ఉన్నాయి. చిరంజీవి గారి 150వ సినిమా నేనే చేయవలసింది. వాళ్లు కోరినట్లే ఓ భారీ కథ తయారు చేశాను. నేను చెప్పిన పాయింట్ ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు. ఐతే చిరంజీవి గారికి నా కథ కంటే ‘కత్తి’ బాగుందనుకున్నారు. ఆ సినిమానే చేయాలనుకున్నారు. ఇక గత కొన్నేళ్లుగా నేనేమీ ఖాళీగా లేను. అమీర్ ఖాన్ గారితో చేయాలన్నది నా జీవితాశయం. ‘జీనియస్’ తర్వాత ఆయన కోసం స్క్రిప్టు రాయడం మొదలుపెడితే మూడేళ్లు పట్టింది. గత ఏడాదే పని పూర్తయింది. హిందీ వాళ్లతో డైలాగులు కూడా రాయించాను. వచ్చే నెలలోనే అమీర్ ఖాన్ కు సబ్మిట్ చేస్తా’’ అని చెప్పాడు చిన్నికృష్ణ.
ఇంతకీ వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి.. బాలయ్య మధ్య పోటీ జరగబోతోంది కదా.. దాని గురించి మీ అభిప్రాయమేంటి అని అడిగితే.. ‘‘చిరంజీవి గారు చేస్తున్నది రీమేక్. ఆల్ మోస్ట్ జిరాక్స్ కాపీ లాంటిది. ఇక బాలయ్యది చరిత్ర గురించి చెప్పే సినిమా. రెండూ స్ట్రెయిట్ సినిమాలైతే మాట్లాడొచ్చు. పోల్చవచ్చు. కాబట్టి దీని గురించి చెప్పేదేమీ లేదు’’ అన్నాడు చిన్నికృష్ణ.