Begin typing your search above and press return to search.
అక్కినేని కుటుంబం ఆయనను బెదిరించిందా?
By: Tupaki Desk | 18 Nov 2017 3:38 PM GMTతన బిజినెస్ పార్ట్నర్ చింతలపూడి శ్రీనివాసరావుపై నాగార్జున అక్క నాగ సుశీల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తమ కంపెనీ ఎస్ ఎస్ ప్రాపర్టీకి చెందిన 37ఎకరాల భూమికి సంబంధించి కోర్టు స్టే ఇచ్చిందని, దానిని లెక్క చేయకుండా తన సంతకాలను శ్రీనివాస్ ఫోర్జరీ చేసి ఆ భూమిని అమ్మేందుకు ప్రయత్నించాడని నాగ సుశీల ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా ఎస్ఎస్ ప్రెమిసెస్ పేరిట శ్రీనివాస్ మరో కంపెనీని ప్రారంభించాడని ఆరోపించారు. నాగ సుశీల ఆరోపణలపై శ్రీనివాస్ స్పందించారు. తాను ఎవరి సంతకాలను ఫోర్జరీ చేయలేదని, 2005 - 06లో చట్టబద్ధంగానే రిజిస్ట్రేషన్ లు జరిగాయన్నారు. సాంకేతిక కారణాలతో అప్పట్లో రిజిస్ట్రేషన్లు ఆలస్యమయ్యాయని, అందుకే ఇపుడు చేయాల్సి వచ్చిందన్నారు. ఆ కంపెనీలో మేజర్ షేర్స్ తనవేనని, రిజిస్ట్రేషన్ పవర్ - బ్యాంకు లావాదేవీల పవర్ తనకే ఇచ్చారన్నారు.
పదేళ్ల క్రితం జరిగిన లావాదేవీలలో ఇపుడు అవకతవకలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి, తనకు రావాల్సిన డబ్బులను ఎగ్గొట్టేందుకు సుశీల ఇలా రివర్స్ కేసు పెట్టారని ఆరోపించారు. తాను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటే ఆవిడ జాయిన్ అయ్యారని చెప్పారు. తన కంపెనీలో వాళ్లు పార్ట్‌నర్స్ అని, తాను ఆవిడకి బినామీ కాదని చెప్పారు. తాను మోసకారిని అయితే, 12ఏళ్లపాటు తన భాగస్వామిగా ఎలా ఉన్నారని ప్రశ్నించారు. తాము నిర్మించిన కాళీదాసు - అడ్డా - కరెంటు చిత్రాలు కూడా కంపెనీకి నష్టాలే మిగిల్చాయన్నారు. చివరగా వచ్చిన ‘ఆటాడుకుందాం రా’ విషయంలో తాను అభ్యంతరపెట్టినట్లు శ్రీనివాసరావు చెప్పాడు. ఈ సినిమా స్క్రిప్టు తనకు నచ్చలేదని.. ఈ సినిమా వద్దని అన్నా.. నాగసుశీలే పట్టుబట్టి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారన్నాడు. ఈ చిత్రానికి రూ.9 కోట్లకు పైగా ఖర్చవగా.. ఐదు కోట్ల నష్టం వచ్చిందన్నాడు. అక్కినేని కుటుంబం పరువు కాపాడటానికి తానే రూ.4 కోట్ల ఫైనాన్స్ తెచ్చి సినిమా రిలీజయ్యేందుకు సహకరించినట్లు చెప్పాడు.. అప్పటినుంచి తమ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయన్నారు.
ఆ తర్వాత తమ మధ్య పంచాయతీ జరిగిందని చెప్పారు. నాగ్ కు ఈ వ్యవహారం గురించి తెలుసని, ఆయన స్నేహితుడు ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసి లెక్కలన్నీ తేల్చేశారని చెప్పారు. ఆ సమయంలో నాగ సుశీల తనకు బాకీ పడ్డారని ఆరోపించారు. తాజాగా, తనకు ఈ వ్యవహారంలో బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. అక్కినేని కుటుంబం తనను బెదిరిస్తున్నట్లు శ్రీనివాసరావు ఆరోపించాడు. తనకు నాగార్జున సపోర్ట్ ఉందని నాగసుశీల తనను బెదిరించినట్లు అతను చెప్పాడు. తనను దెబ్బ తీసేందుకు సుపారి ఇస్తున్నట్లు కూడా హెచ్చరించినట్లు తెలిపాడు.నాగార్జున - కేటీఆర్ పేరును ఉపయోగిస్తున్నారని.. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని.. ఐతే కేటీఆర్ ఇలాంటి వివాదాల్లో జోక్యం చేసుకుంటాడని తాను భావించడం లేదని శ్రీనివాసరావు అన్నాడు.
తనకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకంముందన్నారు. ఆవిడ మాటలను బట్టి ఈ వ్యవహారాన్ని నాగార్జున గారు ఇన్‌ఫ్లూయెన్స్ చేసుండొచ్చని అన్నారు. తనకేమైనా అయితే నాగార్జున గారే బాధ్యత వహించాలని శ్రీనివాసరావు చెప్పారు. అయితే, ఈ వ్యవహారంపై నాగార్జున - నాగ సుశీల ఎవరూ స్పందించలేదు. ఈ కేసు కోర్టులో ఉన్నందున ఈ వ్యవహారంపై తామేమీ మాట్లాడలేమని నాగ్ ఫ్యామిలీ చెబుతోంది.