Begin typing your search above and press return to search.
కొరటాల టార్గెట్ రూమర్స్‌పై చిరు క్లారిటీ!
By: Tupaki Desk | 13 Jan 2023 4:40 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వాల్తేరు వీరయ్య`. బాబి డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారీ స్థాయిలో ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీపై ప్రారంభం నుంచి ఫ్యాన్స్ భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సినిమా వుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ సందర్భంగా పలు ప్రమోషనల్ ఈవెంట్ లలో దర్శకుల గురించి, దర్శకులు చేయాల్సిన, చేయకూడని పని గురించి చిరు పదే పదే వివరించడం, అంతే కాకుండా `వాల్తేరు వీరయ్య` చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు బాబి పనితనాన్ని ప్రత్యేకంగా గుర్తు చేస్తూ అతనిపై ప్రశంసలు కురిపించడం.. తండ్రి చనిపోయిన మూడవ రోజే బాబి షూటింగ్ కొచ్చాడని చెప్పడం తెలిసిందే. ఇక `ఆచార్య` రిలీజ్ తరువాత పలు సినిమా ఈవెంట్ లలో పాల్గొన్న చిరు దర్శకులు సెట్ లో డైలాగ్ లు, సీన్ లు రాస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని కామెంట్ లు చేశారు.
ఇవన్నీ దర్శకుడు కొరటాల శివను ఉద్దేశిస్తూ చిరు అన్నారంటూ సోషల్ మీడియా వేదికగా గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. `ఆచార్య` డిజాస్టర్ కావడానికి దర్శకుడు కొరటాల శివ కూడా కారణమని, తను సినిమా కథ, కథనాలపై దృష్టి పెట్టకుండా నిర్మాణం, బిజినెస్ పై దృష్టి పెట్టడం వల్లే సినిమా డిజాస్టర్ గా నిలిచిందిని నెటిజన్ లు నెట్టింట ప్రచారం చేశారు. ఇదిలా వుంటే కొరటాలని ఉద్దేశించి తాను కామెంట్ లు చేయలేదని `వాల్తేరు వీరయ్య` మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న చిరంజీవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇండస్ట్రీ బాగుండాలంటే ప్రతి దర్శకుడు సెట్స్ కు వెళ్లే ముందే ప్రతి అంశాన్ని పేపర్ పై వర్కవుట్ చేయాలని చెప్పాను. నాలుగు గంటల నిడివితో సినిమా షూటింగ్ చేసి ఆ తరువాత ఒక గంట లెంగ్త్ ను ట్రిమ్ చేయడం కంటే పర్ ఫెక్ట్ గా మూడు గంటలలోపే షూటింగ్ చేసే విధంగా పక్కా స్క్రీన్ ప్లేతో రూపొందించడం ఉత్తమం. దీంతో ప్రొడక్షన్ ఖర్చు ఆదా అవుతుంది. ఇది సాధారణంగా చెప్పిన మాటలే కానీ దర్శకుడు కొరటాలను ఉద్దేశించి అన్నవి కావు.
కొరటాలను నేను టార్గెట్ చేయలేదు. ఆయనపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మరోసారి క్లారిటీ ఇస్తున్నాను` అంటూ కొరటాల వివాదంపై చిరంజీవి ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు. చిరు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే కొరటాల వివాదంపై మాట్లాడిన చిరు క్లారిటీ ఇచ్చారా? లేక తన వెర్షన్ మాత్రమే వినిపించారా? అనే అనుమానాల్ని నెటిజన్ లు వ్యక్తం చేస్తున్నారు.