Begin typing your search above and press return to search.
కొంత సినిమా చూశాను..చక్కని సందేశం.. కమర్షియల్ హంగులున్న చిత్రమిది!-చిరు
By: Tupaki Desk | 9 March 2021 3:32 AM GMTశర్వానంద్ సినిమా సినిమాకి నటుడిగా పరిణతితో కనిపిస్తున్నాడు. ఎంతో పరిణతి చెందాక నటించిన `శ్రీకారం` ఘనవిజయం సాధిస్తుందని మెగాస్టార్ చిరంజీవి ప్రీరిలీజ్ వేడుకలో శర్వా అండ్ టీమ్ ని ఆశీర్వదించారు. ఇదే వేదికపై ఆయన మాట్లాడుతూ.. షూటింగ్ బిజీ వల్ల శ్రీకారం పూర్తి సినిమా చూడలేకపోయానని .. కొంత సినిమా చూడగానే అభినందించాలనిపించిందని అన్నారు.
``వ్యవసాయం గొప్పదనం చెప్పే మంచి కథ ఇది.. ఈ సినిమాలో సందేశమే కాదు.. అన్ని రకాల కమర్షియల్ హంగులున్నాయి. సక్సెస్ అవుతుందని సగర్వంగా చెబుతున్నాను.. నేటి యువతరానికి వ్యవసాయ విలువ తెలిసేలా చూపించారు. తప్పకుండా ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను``అని చిరంజీవి అన్నారు.
ఖమ్మం గురించి మాట్లాడుతూ..``సరిగ్గా 12 ఏళ్ల క్రితం నాటి ప్రజా అంకిత యాత్ర పేరుతో ఈ ఖమ్మంలో ప్రచారం చేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. అప్పుడు ఇప్పుడూ అదే ప్రేమను చూపిస్తున్నారు. మీ అభిమానం చెక్కుచెదరలేదు. పోరాటాల ఖమ్మానికి... ఖమ్మం ప్రజలకు యావన్మందికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వేదిక మీదున్న రవాణా శాఖ మంత్రి అజయ్``కి ధన్యవాదాలు అన్నారు. చరణ్ ఫోన్ చేయగానే శర్వానంద్ కోసం ఈ వేడుకకు వచ్చానని చిరు తెలిపారు.