Begin typing your search above and press return to search.

కొత్త మాట: చెర్రీ బర్త్ డే నాడు ముహూర్తం

By:  Tupaki Desk   |   18 Jan 2016 11:10 AM GMT
కొత్త మాట: చెర్రీ బర్త్ డే నాడు ముహూర్తం
X
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే ప్రశ్న.. ఇప్పుడు పజిల్ లా మారిపోయింది. ఎవరికి తోచిన ఆన్సర్ వాళ్లు ఇచ్చేసుకుంటున్నారు. కానీ మెగా క్యాంప్ నుంచి మాత్రం అఫీషియల్ న్యూస్ రావడం లేదు. లేటెస్ట్ గా చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం అయితే, మెగాస్టార్ మూవీకి ముహూర్తం పెట్టారు.

చిరు 150 మూవీకి ముహూర్తం ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. మార్చి 27న ఈ చిరుత పుట్టిన రోజు. ఆ రోజుతో 31 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాడు చెర్రీ. అదే రోజున తను నిర్మాతగా తండ్రి హీరోగా మొదలుకానున్న సినిమాని స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ వార్త ఫ్యాన్స్ కి హుషారు ఇచ్చేదే కానీ.. ఇందులో వాస్తవమెంత అన్నదే అసలు ప్రశ్న. దీన్ని ఎంతవరకూ నమ్మాలనే డౌట్ సహజంగానే వస్తుంది. ఎందుకంటే తన సినిమాపై చిరంజీవే స్వయంగా ప్రకటించారు. బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి తన మూవీపై ఓ ప్రకటన చేశారు. బ్రూస్ లీ రిలీజ్ అయ్యాక మిగిలిన విషయాలను చరణ్ చెబుతాడంటూ భరోసా ఇచ్చారు. ఆ మూవీ వచ్చింది, చిరు ఇంట్రో అయిపోయింది. 150 గురించిన ప్రకటన మాత్రం రాలేదు.

కత్తి గురించి తర్వాత పెద్దగా డిస్కషన్ కూడా రాలేదు. ఇప్పుడు సడెన్ గా మరోసారి ముహూర్తం పెట్టారంటూ న్యూస్ వస్తున్నాయి. చిరంజీవి స్వయంగా చెప్పినదే జరగనపుడు.. ఇలాంటి రూమర్లను ఎంతవరకూ నమ్మాలనేది అసలు ప్రశ్న. కాదు కాదు.. ఇదో పజిల్ ఇపుడు. దీన్ని సాల్వ్ చేయగలిగేది చెర్రీ మాత్రమే. మరి ఆ చిరుత అసలు విషయం ఎప్పటికి చెబుతాడో!