Begin typing your search above and press return to search.
చిరు 150కి ముహూర్తం ఫిక్స్..
By: Tupaki Desk | 25 April 2016 7:23 AM GMTమెగా ఫ్యాన్స్ ఎన్నాళ్లో వేచిన ఉదయం.. త్వరలో వచ్చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పుడా ముహూర్తం ఫిక్స్ అయింది. కోలీవుడ్ మూవీ కత్తిని రీమేక్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్న చిరు.. ఇప్పుడా మూవీ ప్రారంభానికి ముహూర్తం కూడా నిర్ణయించేశారు. ఏప్రిల్ 29న కత్తి రీమేక్ ప్రారంభానికి ముహూర్తంగా నిర్ణయించారు.
కత్తిలాంటోడు అనే వర్కింగ్ టైటిల్ పై షూటింగ్ చేయనున్న ఈ మూవీకి.. హైద్రాబాద్ లో ముహూర్తం షాట్ తీయనున్నారు. ఇవాళ అంటే ఏప్రిల్ 25 సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. వివి వినాయక్ ఈ మూవీకి దర్శకత్వం వహించనుండగా.. మెగా తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మించనున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తొలి చిత్రంగా రూపొందనుంది కత్తిలాంటోడు. కోలీవుడ్ మూవీని మెగాస్టార్ కు అనుగుణంగా అనేక మార్పులు చేశాడు దర్శకుడు వినాయక్. దర్శకుడు చేసిన మార్పు చేర్పులపై మెగాస్టార్ ఫుల్ ఖుషీ అయ్యారని రీసెంట్ గా వార్తలొచ్చాయి.
అయితే.. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోందని అన్నారు కానీ.. ఇప్పటివరకూ తనను ఎవరూ సంప్రదించలేదని నయన్ తేల్చేసింది. దీంతో హీరోయిన్ సంగతులు కూడా ముహూర్తం షాట్ రోజున ప్రకటించే ఛాన్సులు ఉన్నాయి. మెగాస్టార్ 150వ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం ఇప్పటికే ఖాయమైంది.