Begin typing your search above and press return to search.

ఫైట్ తో మొదలు కానున్న చిరు 150

By:  Tupaki Desk   |   4 Jun 2016 9:47 AM GMT
ఫైట్ తో మొదలు కానున్న చిరు 150
X
ఫైట్స్.. ఏ సినిమాకైనా ఇప్పుడివి తప్పనిసరి. టాలీవుడ్ లో స్టోరీ కంటే ముఖ్యంగా ఫైట్లు, పాటలు సినిమాలో ముఖ్యం అయిపోవడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి. ఆ రేంజ్ లో జనాలని మైమరిపించడం మెగాస్టార్ స్పెషాలిటి. 2007లో శంకర్ దాదా జిందాబాద్ తర్వాత ఇప్పుడు మళ్లీ తొమ్మిదేళ్లకు చిరు చేయబోతున్న సినిమాకి అన్నీ కుదిరాయి. కత్తిలాంటోడు మూవీ షూటింగ్ ని ఈ నెల 15 నుంచి ప్రారంభించబోతున్నారు.

మరి ఇన్నేళ్ల తర్వాత చిరు ఏ సీన్ తో షూటింగ్ స్టార్ట్ చేస్తారు? అలాంటి ఇలాంటి సీన్స్ తో చేయడానికి ఆయనేమీ సాధారణ స్టార్ కాదు.. మెగాస్టార్. అందుకే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో రీఎంట్రీకి శ్రీకారం చుడుతున్నారు చిరు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోగా.. ఫైనల్ స్క్రిప్ట్ చూసి మొత్తం యూనిట్ మెస్మరైజ్ అయింపోయిందని అంటున్నారు. జూన్ 15న మొదలు పెట్టే షూటింగ్.. డిసెంబర్ తో పూర్తి చేసేయాలన్నది టార్గెట్.

2017 జనవరి 13న మెగాస్టార్ 150వ సినిమాని రిలీజ్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఈ మూవీలో మొత్తం ఐదు పాటలు ఉండగా.. ఇంకా హీరోయిన్ ని ఫైనలైజ్ చేయలేదు. మెగాస్టార్ రీఎంట్రీలో ఎన్నెన్ని రికార్డులు బ్రేక్ చేస్తారా అని ఇండస్ట్రీ జనాలతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.