Begin typing your search above and press return to search.

ఉయ్యాలవాడ సినిమా అసలు చరిత్ర రేపే

By:  Tupaki Desk   |   21 Aug 2017 7:16 PM IST
ఉయ్యాలవాడ సినిమా అసలు చరిత్ర రేపే
X
కరెక్ట్ గా 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఇంకా ఉందంటూ... బాక్స్ ఆఫీసు కొత్త పాటలు నేర్పిన మెగాస్టార్ ఎట్టకేలకు తన 151వ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఇటీవల సింపుల్ గా పూజా కార్యక్రమాలతో వర్క్ ను మొదలు పెట్టిన చిరు మంగళవారం తన పుట్టినరోజు సందర్బంగా "ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి" మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు.

రేపు ఉదయం 11:30 గంటలకు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ఈ చిత్రంలోని అన్ని పాత్రలను స్కెచ్ తో వేసిన చిత్రాలతో చూపించనున్నారట. అందుకు చిరు తనయుడు చిత్ర నిర్మాత అయిన రామ్ చరణ్ ఈ వేడుకకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక గచ్చిబౌలి లోని సంధ్యా కన్వెన్షన్ లో అట్టహాసంగా జరగనుంది. అలాగే చిత్రంలోని ఎవరెవరు ఏ తరహా పాత్రలు చేస్తున్నారు అలాగే ఈ చిత్రానికి పనిచేయబోయే పూర్తి యూనిట్ సభ్యులను కూడా దర్శకుడు సురేందర్ రెడ్డి లిస్ట్ రెడీ చేసుకున్నాడు. ఆ వివరాలు కూడా రేపటి కార్యక్రమంలో మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలపనున్నారట.

గత కొంత కాలంగా కొన్ని మీడియాల్లో వస్తున్న ప్రశ్నలన్నింటికి మరియు రూమర్స్ కి రేపు చిత్ర నిర్మాత చరణ్ సమాధానం చెప్పబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిరు కెరీర్ లొనే భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఇక కొణిదెల ప్రొడక్షన్ పై నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగులో పాటు హిందీ-తమిళ్ -మలయాళం భాషల్లో కూడా రిలీజ్ కానుంది.