Begin typing your search above and press return to search.
#CHIRU152 థాయ్ సిట్టింగ్స్ లో రైటర్ దేనికి?
By: Tupaki Desk | 9 Dec 2019 7:10 AM GMT#CHIRU152 ఈనెల 26న హైదరాబాద్ లోని మెగాస్టార్ ఫామ్ హౌస్ లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లలో దర్శకనిర్మాతలు కొరటాల-చరణ్ బృందం బిజీగా ఉన్నారు. అంతకుముందే మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం కొరటాల అండ్ కో థాయ్ లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఒంటరి దీవిలో ఎంతో రిలాక్స్ డ్ గా ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా మెలోడి బ్రహ్మ మణిశర్మ బాణీల్ని రెడీ చేస్తున్నారు.
ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి .. కొరటాల శివ ఈ సిట్టింగ్స్ కోసం థాయ్ ల్యాండ్ వెళ్లారు. ఇంకా సిట్టింగ్స్ కొనసాగిస్తున్నారనే తెలుస్తోంది. తాజాగా థాయ్ విజిట్ కి సంబంధించిన ఓ ఫోటో అంతర్జాలంలోకి రివీలైంది. ఈ ఫోటోలో దర్శకుడు కొరటాలతో పాటుగా సంగీత దర్శకుడు మణిశర్మ.. రచయిత శ్రీధర్ సీపాన కనిపించారు. ఈ సిట్టింగ్స్ వ్యవహారం చూస్తుంటే.. కేవలం మ్యూజిక్ కోసమే కాదు.. స్క్రిప్టులో ఇంప్రూవైజేషన్ కోసం కూడా వెళ్లారా? అన్న సందేహం వస్తోంది.
అంటే కథకు తగ్గట్టే బాణీ కట్టాలి. అలాగే ఆర్.ఆర్ తో పాటు బీజీఎంని రెడీ చేయాల్సి ఉంటుంది. ఆ సంగతుల్ని దర్శకరచయితలతో మణిశర్మ డిస్కస్ చేస్తున్నారన్నమాట. మెలోడీ బ్రహ్మగా పేరున్న మణిశర్మ బీజీఎం ఇవ్వడంలో మాస్టర్ మైండ్. రీరికార్డింగ్ లోనూ ఆయనకంటూ ప్రత్యేకించి ఐడెంటిటీ ఉంది. కొరటాల ఆ రెండిటి విషయంలో ఏమాత్రం రాజీకి రావడం లేదని అర్థమవుతోంది. దేవాలయ భూములు.. స్కామ్ లు అంటూ చాలా గట్టిగానే వెళుతున్నారు కాబట్టి అందుకు తగ్గట్టే ప్లానింగ్ నడుస్తోందన్నమాట. ఈ సినిమాకి ఆచార్య అనే టైటిల్ అనుకుంటున్నారన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.