Begin typing your search above and press return to search.

చిరు ఊపు ఏమాత్రం తగ్గట్లే.. టాప్ 7లో 3 ఆయనవే!

By:  Tupaki Desk   |   20 Jan 2023 4:36 PM GMT
చిరు ఊపు ఏమాత్రం తగ్గట్లే.. టాప్ 7లో 3 ఆయనవే!
X
ఈ సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా వాల్తేరు వీరయ్య విడుదలైన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు రోజు బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి రిలీజ్ అయింది. ఆ సినిమాను దాటుకుని వాల్తేరు వీరయ్య సినిమా విడుదలైన రోజు నుంచి.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంచలన వసూళ్లను సొంతం చేసుకుంటూ.. దూసుకుపోతుంది. వీరసింహారెడ్డి సినిమాలో కాస్త రక్తపాతం, హింస ఉండటంతో... జనాలు వాల్తేరు వీరయ్య సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. దానికి తోడు ఈ సినిమాలో రవితేజ కూడా ఉండటం.. చిరు ఎనర్జీకి రవితేజ ఎనర్జీ తోడవడం ప్లస్ అయింది. ఇందులో చిరుకు జోడిగా శృతి హాసన్ నటించారు.

ఇక ఈ సినిమాను చిరంజీవి వీరాభీమాని బాబీ కొల్లి తెరకెక్కించాడు. చిరంజీవిని జనాలు ఏ విధంగా చూడాలి అనుకుంటున్నారో.. అదే విధంగా సినిమాలో చిరంజీవిని చూపించారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ.. వింటేజ్ చిరంజీవిని చూశామని తెగ సంబరపడిపోయారు. ఇక 7వ రోజూ కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

7వరోజు 4.85 కోట్ల కలెక్షన్లను సొంత చేసుకుంది. అయితే గతంలో రిలీజ్ అయిన సినిమాల లిస్టులో ఈ సినిమా 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్గా ఈ టాప్ 7 మూవీస్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు 3 ఉండటం విశేషం. ఒకసారి టాలీవుడ్లో 7వరోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీస్ను గమనిస్తే... అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా 8.43 కోట్లను వసూళ్లు చేసి టాప్ 1లో నిలిచింది.

ఇక రాజమౌళి, ప్రభాస్,రానా కాంబినేషన్లో వచ్చిన బహుబలి 2 సినిమా టాప్ 2లో నిలిచింది. ఈ సినిమా 8.30 కోట్లను కలెక్ట్ చేసింది. ఇక సురేందర్రెడ్డి, చిరంజీవి కాంబోలో వచ్చిన సైరా నరసింహ రెడ్డి సినిమా టాప్ 3లో నిలిచి.. 7.90 కోట్లను సాధించింది.

ఇక మహేశ్ సరిలేరు నీకెవ్వరు సినిమా టాప్ 4 లో నిలిచి 7.64 కోట్లను కొల్లగొట్టింది. ఇక రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా టాప్ 5 లో నిలిచి.. 7.48 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమాలు పలు అంతర్జాతీయ అవార్డులు సైతం వచ్చాయి. ఇక టాప్ 6లో మళ్లీ చిరంజీవి సినిమానే నిలిచింది. చాలా ఏళ్ల తర్వాత చిరు సినిమాల్లోకి ఖైదీ నంబర్ 150తో పునః ప్రవేశం చేశారు. ఈ సినిమా 7 రోజుల్లో 5.28 కోట్లు వసూలు చేసింది. ఇక ఇటీవల విడుదలైన చిరు మూవీ వాల్తేరు వీరయ్య కూడా టాప్ 7లో నిలదొక్కుంది.

ఆ సినిమా 4.85 కోట్లు వసూలు చేసింది. ఇవీ మొత్తం మీద 7వ రోజు అత్యధిక కలెక్షన్స్ని సాధించిన సినిమాల వివరాలు. మొత్తం మీద ఈ లిస్టులో టాప్ 3, టాప్ 6 , టాప్ 7 ప్లేసులతో మెగాస్టార్ చిరంజీవి సంచలనం సృష్టించాడు. ఇక మిగిలిన రన్లో వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.