Begin typing your search above and press return to search.
చిరు సందడి నాలుగు నిమిషాలు!
By: Tupaki Desk | 12 Oct 2015 8:25 AM GMTసెన్సార్ రూమ్ నుంచి బ్రూస్‌లీ సంగతులు ఒకొక్కటిగా బయటికొస్తున్నాయి. యూనిట్ అహోరాత్రులు శ్రమించి ఫస్ట్ కాపీని సోమవారం సెన్సార్ కి పంపించారు. ప్రస్తుతం సెన్సార్ కోసం ప్రదర్శన జరుగుతోంది. పక్కా కుటుంబ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారన్న విషయం తెలిసిందే. చిరు రీ ఎంట్రీ సినిమా ఇదే కాబట్టి అందరి ఆసక్తి ఆయన పాత్ర గురించే. ఆయన తెరపై ఎంత సేపు కనిపిస్తారు? ఎలా కనిపిస్తారు? అనే విషయాలు గురించి ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం మేరకు చిరు 4 నిమిషాలు సందడి చేస్తాడట. అది కూడా ఫైట్ సీక్వెన్స్ లో. హీరోయిన్ రకుల్ ని కాపాడటంలో రామ్ చరణ్ కి సాయం చేయడం కోసం చిరంజీవి ఎంట్రీ ఇస్తాడట. సరిగ్గా నాలుగు నిమిషాలసేపు తెరపై కనిపిస్తాడట. చివరిగా... మన అభిమానులు పిలుస్తున్నారు, వెళ్లాలి... అని డైలాగ్ చెప్పి వెళ్లిపోతాడట.
మొదట్నుంచి చిరంజీవి ఈ సినిమాలో ఓ పాటలోనూ, ఫైట్ లోనూ కనిపిస్తాడని ప్రచారం సాగింది. కానీ రామ్ చరణ్ స్వయంగా జోక్యం చేసుకొని ``నాన్న పాటలో కనిపించడం వద్దు, ఫైట్ కే పరిమితం చేద్దామ``ని దర్శకుడిని ఒప్పించాడు. మూడు రోజులపాటు చిరుపై ఆ సన్నివేశాలు తీశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమాలో చిరు కనిపించేది మూడు నిమిషాలే అని ప్రచారం సాగింది. కానీ నాలుగు నిమిషాలు అని తాజా రిపోర్ట్. చిరంజీవి గుర్రంపై ఎంట్రీ ఇస్తాడట. ఆ సమయంలో రామ్ చరణ్ కూడా గుర్రంపైనే కనిపిస్తాడని సమాచారం. తండ్రీ కొడుకులు గుర్రాలని దౌడు తీయిస్తారన్నమాట. శ్రీనువైట్ల చిరు పాత్ర గురించి మాట్లాడుతూ... గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి ఎంత ఛార్మింగ్ గా కనిపిస్తుంటారో ఇందులోనూ అలాగే కనిపిస్తారని చెప్పారు. ఇక అభిమానులకు పండగే అన్నమాట.