Begin typing your search above and press return to search.
స్పెషల్ : స్టార్..స్టార్.. 'మెగా'స్టార్.. స్టార్
By: Tupaki Desk | 22 Aug 2015 5:16 AM GMTచిరంజీవి... పేరు తలుచుకోగానే కొన్ని లక్షల మెగావాట్ ల ఎనర్జీతో కట్టెలు తెంచుకొస్తున్న పదాల ప్రవాహ పరంపరకు ఆనకట్ట వేస్తూ సమకూర్చిన సమగ్ర కధనం..
సరిగ్గా 60ఏళ్ళ క్రిందట గోదారి దారిలో వున్న మొగల్తూరుకి తెలియకపోవచ్చు తాను భవిష్యత్ లో సినీ సంచలనానికి కేంద్రబిందువుగా నిలవనున్న పసి బిడ్డను మోస్తున్నానని, తల్లి అంజనాదేవికి అప్పుడు తెలిసివుండక పోవచ్చు.. తెలుగు సినిమా సింహాసనాన్ని ఏలే మొనగాడి బోసి నవ్వులు వింటున్నానని.. కట్ చేస్తే తనొక సినీ శిఖరంగా ఎదిగాడు. అప్పటికే ఎన్.టి.ఆర్ దేవుడిగా పూజింపబడుతున్నాడు, ఏ.ఎన్.ఆర్ నవలానాయకుడిగా ప్రేమింపబడుతున్నాడు, కృష్ణ కొత్తదనంతో కీర్తింపబడుతున్నాడు.. వీరి ముందు నిలబడాలంటే ఏం చెయ్యాలి అన్న ప్రశ్నకు తనదైన శైలిలో డ్యాన్స్ ని, ఎంటర్ టైన్మెంట్ ని, కామెడి ని, మాస్ ని కలబోసి తనకంటూ ఒక బెంచ్ మార్క్ సృష్టించుకున్నాడు.
తెలుగు సినిమాని కమర్షియల్ ఎక్స్ప్రెస్ ఎక్కించిన ఘనుడు చిరంజీవి. అప్పటివరకూ కనీ వినీ ఎరుగని హీరోయిజం కళ్ళముందు కదలాడే సరికి అభిమానులు ఉబ్బితబ్బిబ్బైపోయేవారు. సుప్రీమ్ హీరో, మెగాస్టార్ ల బిరుదులు చిరు ముందు నిలుచుని సత్కారాన్ని అందుకున్నాయి. టిక్కెట్ దొరికితే పండగలు.. ఫస్ట్ షో పడకపోతే ధర్నాలు, ప్రధాన కూడలి థియేటర్ ల దగ్గర ట్రాఫిక్ జామ్ లు, కట్ అవుట్ లకు పాలాభిషేకాలు ఇటువంటి వెర్రి అభిమానాలకి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి సినిమాలే. చిన్న పిల్లలు కొత్తగా ఒక డైలాగ్ చెప్పినా, ఒక స్టెప్పేసినా, చిన్నగా నవ్వించినా 'ఈడు పెద్దయ్యాక చిరంజీవైపోతాడు' అన్న డైలాగ్ మీ ఇంట్లో కూడా పడే వుంటది.
ఎంటర్ టైన్మెంట్ లో సైతం వైవిధ్యం చిరు నైజం. నా ముక్కుమీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి.. అంటూ త్రాగుబోతు పాత్రలో నవ్వు తెప్పించిన తీరు అసామాన్యం. నాయకుడు కులం నుండికాదు జాతి నుండి పుడతాడన్న సూత్రాన్ని జ్ఞప్తి చేసినా, స్టైల్ గా ప్యాంట్ జేబులో చెయ్యి పెట్టుకుంటే అదికాస్తా చిరిగి బయటకు కనిపించి నవ్వించినా అంతెందుకు కేవలం లుంగీ కట్టి నోట బీడీ పట్టినా ప్రేక్షకులు చిరంజీవి నటనకు ఎప్పియరెన్స్ కి బ్రహ్మరధం పట్టారు.
చిరంజీవి నెలకొల్పిన రికార్డులన్నీ కలిపితే అదొక రికార్డు. 149 సినిమాలు అందులో 100కు పైగా కమర్షియల్ హిట్లు, 30 కి పైగా బ్లాక్ బస్టర్ లు.. అయినా కేవలం సినిమా గురించి, కలెక్షన్ల గురించి మాత్రమె మాట్లాడుకునే సాధారణ వ్యక్తి కాదు చిరు. సామాజిక సేవతో అభిమానులను ముందుండి నడిపించిన శక్తి చిరంజీవి. తెలుగు ప్రేక్షకుడికి తమ షర్టు కాలర్ విలువ తెలిపిన ఘనుడు చిరు. అతనోదిలెళ్ళి పోయాక నెంబర్ 1 స్థానం 8ఏళ్ళు గడిచినా అలానే ఖాళీగా వుందంటే, ఇప్పటికీ నగరం నడిబొడ్డున చిరంజీవి రాష్ట్ర యువత పేరుతొ కటౌట్ లు వేలుస్తున్నయంటే కళామతల్లి పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోదా?
రజినికాంత్ + కమల్ హాసన్ = చిరంజీవి' అని బాలచందర్ కీర్తించారు. 'హి ఇస్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా' అని అమితాబ్ తేల్చేశారు. అలాంటి చిరంజీవి గురించి రాయాలంటే ఒక సినిమాలో చెప్పినట్టు 'ఆత్రేయని అక్షరాలు అడగాలి... త్రివిక్రమ్ ని పెన్ అడగాలి'... వారిని తలుచుకుంటూ...
చిరు పై ఓ చిరు కవిత :
అమ్మా నాన్నల తరువాత ఎంతోమందిని ఆకర్షించిన తొలి పదం చిరంజీవి..
శ్రమకి ఈ పరిశ్రమ ఎప్పుడూ పట్టంకడుతుందని నిరువుపించిన శ్రమజీవి..
మరోసారి చూసేందుకు చేసే నేత్రదానం మీ నుండి అందిపుచ్చుకున్న కరుణ
యుక్త వయసునుండే రక్త దానం మీరు మాకు అందించిన ప్రేరణ
కళ్ళలో రౌద్రం, కాళ్ళలో వేగం
నీ నృత్యం నటరాజుకి ఆనవాలు..
మా మదిని వెంటాడుతూనే వుంటాయి నీ సినిమాల జ్ఞాపకాలు..
తెరపై నువ్వుంటే ఆకాశంలో సూర్య చంద్రలు కలిసినట్టు..
తెలుగు సినీ సింహాసనంపై మెగా ఇంద్రుడు నిలిచినట్టు..
నువ్వంటే ఎందరికో స్పూర్తి..
ఎన్నటికీ తరగదు నీకున్న కీర్తి..
సినీ ప్రియుల గుండెల్లో కలాకాలం కొలువుండే మూర్తి..
అందరికీ స్వీట్ సిక్స్ టీన్(16) అయితే మీ అభిమానులకిది స్వీట్ సిక్స్టీ(60).. ఇలానే నవ్వుతూ బ్రతికెయ్యి నెక్స్ట్ ఫార్టీ(40)..
తుపాకీ.కామ్ తరుపున మెగాస్టార్ చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు