Begin typing your search above and press return to search.

ఖైదీ నెం 150కి 'ఖైదీ' నచ్చలేదా??

By:  Tupaki Desk   |   15 Jan 2017 8:27 AM GMT
ఖైదీ నెం 150కి ఖైదీ నచ్చలేదా??
X
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే.. చక్కగా తన డైరక్టర్ వివి వినాయక్ అలాగే ప్రొడ్యూసర్ రామ్ చరణ్‌ తో కలసి తెగ ఇంటర్యూలు ఇచ్చేస్తున్నాడు. అలాంటి ఒక ఇంటర్యూలో ఒక ఇంట్రెస్టింగ్ కమ్ షాకింగ్ విషయం ఒకటి రివీల్ చేశారాయన. పదండి ఏంటో చూద్దాం.

నిజానికి 150 సినిమాలు కంప్లీట్ చేసిన చిరంజీవి.. అసలు తన కెరియర్లో ఏదైనా సినిమాను తిరిగి సరిగ్గా తీయాలని భావిస్తే.. దేనిని ఎంచుకుంటారు? బహుశా ఆయన మనస్సుకు నచ్చి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైన ఏదైనా ఫ్లాప్ సినిమా పేరు చెబుతారేమో అనుకుంటాం. కాని చిరంజీవి మాత్రం అనూహ్యంగా ''ఖైదీ'' సినిమాను తాను మళ్ళీ తీస్తే బెటర్ అనుకుంటున్నట్లు చెప్పారు. ఇది ఖచ్చితంగా చాలా షాకింగ్ రివిలేషన్ అనే చెప్పాలి.

అప్పటవరకు ఒక మోస్తరు హీరోగా దూసుకుపోతున్న చిరంజీవి కెరియర్ ను.. అమాంతం ఒక పెద్ద స్టార్ గా మార్చేసిన సినిమా ఖైదీ. ఈ సినిమాతో ఆయన బిజియస్ట్ యాక్షన్ స్టార్ గా మారిపోవడం మనం చూశాం. అంతటి బ్రేకిచ్చిన ఖైదీ సినిమాను ఈ ఖైదీ నెం 150 తిరిగి తీయాలని అనుకుంటున్నారంటే.. అసలు అందులో ఏం మార్పులు చేయాలని అనుకుంటున్నారో ఏమో!!