Begin typing your search above and press return to search.

కొర‌టాల‌పై త‌న‌కు ఆ ఉద్దేశ్య‌మే లేద‌ట‌!

By:  Tupaki Desk   |   17 Jan 2023 6:27 AM GMT
కొర‌టాల‌పై త‌న‌కు ఆ ఉద్దేశ్య‌మే లేద‌ట‌!
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'వాల్తేరు వీర‌య్య‌'. చిరుని చాలా ఏళ్ల త‌రువాత వింటేజ్ లుక్ లో ప్ర‌జెంట్ చేయ‌డంతో మాస్ ఆడియ‌న్స్ కి పూన‌కాలు తెప్పిస్తోంది. బాబి డైరెక్ట‌ర్ చేసిన ఈ మూవీ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న భారీ స్థాయిలో విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఇప్ప‌టికే 108 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీ ఓవ‌ర్సీస్ మార్కెట్ లో 1.7 మిలియ‌న్ మార్కుని చేరు కోవ‌డం విశేషం.

ఇదిలా వుంటే గ‌త ఏడాది మెగాస్టార్ ఎదుర్కొన్న అత్యంత డిజాస్ట‌ర్ మూవీ 'ఆచార్య‌'. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ మూవీ ఏ విష‌యంలోనూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీలో చిరుతో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టించాడు. ఇలా ఇద్ద‌రు క‌లిసి చేసిన తొలి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్ టాక్ ని సొంతం చేసుకోవ‌డంతో చిరుతో పాటు అభిమానులు కూడా జీర్ఫించుకోలేక‌పోయారు.

ఈ మూవీ రిలీజ్ త‌రువాత ప్ర‌తీ ఈవెంట్ లోనూ చిరు ద‌ర్శ‌కుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో అంతా కొర‌టాల‌ని దృష్టిలో పెట్టుకునే చిరు ఇలా సెటైర్లు వేస్తున్నార‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. 'వాల్తేరు వీర‌య్య' ప్ర‌మోష‌న్స్ లోనూ చిరు ఇదే త‌ర‌హాలో ద‌ర్శ‌కుల ప‌నితీరుపై విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

అంతే కాకుండా ఇదే క్ర‌మంలో 'వాల్తేరు వీర‌య్య‌' డైరెక్ట‌ర్ బాబిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇటీవ‌ల కొర‌టాలను త‌ను టార్గెట్ చేస్తున్నానంటూ వ‌స్తున్న కామెంట్ ల‌పై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చిరు స్పందించారు.

త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. త‌ను కావాల‌ని ఎవ‌రినీ టార్గెట్ చేయ‌లేద‌ని, కొర‌టాల శివ‌ను టార్గెట్ చేస్తూ త‌ను వ్యాఖ్య‌లు చేశాన‌ని అన‌డంలో ఎలాంటా అర్థం లేద‌న్నారు. కొరటాల శివ వ‌ర్క్ లో ఎలాంటి త‌ప్పులేద‌న్నారు.

త‌న‌ని తాను త‌ప్పు ప‌ట్ట‌లేద‌ని, అస‌లు ఆయ‌న‌ని ఉద్దేశించి తాను అస‌లు మాట్లాడ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ద‌ర్శ‌కుల వ‌ర్కింగ్ స్టైల్ పై జ‌న‌ర‌ల్ గా నా అభిప్రాయాన్ని మాత్ర‌మే చెప్పాన‌ని.. ఈ విష‌యంలో ఎవ‌రినీ టార్గెట్ చేయ‌లేద‌న్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.