Begin typing your search above and press return to search.

త‌మ్ముడిది వేగం..అన్న‌య్య‌ది ఆలోచ‌న!

By:  Tupaki Desk   |   4 Jan 2022 5:30 AM GMT
త‌మ్ముడిది వేగం..అన్న‌య్య‌ది ఆలోచ‌న!
X
మెగాస్టార్ చిరంజీవి నిన్న జ‌రిగిన ఆక్సిజ‌న్ బ్యాంక్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త వ్యాఖ్య‌ల‌క మ‌ద్ద‌తు ప‌లుకుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. `క‌ళ్యాణ్‌ బాబు ఏ విష‌యం మీద మాట్లాడినా అది క‌రెక్ట్ అనిపిస్తుంది. కొన్ని విష‌యాల్లో అత‌ని స్పంద‌న చాలా స‌మంజ‌సంగా అనిపిస్తుంది. ప‌వ‌న్ న్యాయం కోస‌మే మాట్లాడుతాడు..పోరాడుతాడు. నేను కూడా న్యాయం కోస‌మే మాట్లాడుతాను. కాక‌పోతే నాకి ప‌వ‌న్ కి ఉన్న తేడా ఏంటంటే? ప‌వ‌న్ త్వ‌ర‌గా స్పందిస్తాడు. నేను స‌మ‌యం తీసుకుని మాట్లాడుతాను అని చిరంజీవి అన్నారు.

ఇప్పుడీ వ్యాఖ్య‌లు మెగా అభిమానుల్లో జోష్ ని నింపాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌వ‌న్ గురించి ఏ వేదిక‌పై ఇలా స్పందించ‌లేదు. త‌న ప్ర‌యాణం సాపీగా సాగాల‌ని..అనుకున్న‌ది సాధించాల‌ని మాత్ర‌మే చిరంజీవి కోరుకునేవారు. కానీ తొలిసారి ప‌వ‌న్ లో చిత్త‌శుద్ది..న్యాయం. పోరాటం గురించి మాట్లాటం ఆస‌క్తిక‌రంగా మారింది. ``ఏపీ ప్ర‌భుత్వం వ‌ర్సెస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్`` వివాదం గురించి తెలిసిందే. దీనికి తోడు టిక్కెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డం.. అద‌న‌పు షోల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డం గురించి కూడా తెలిసిందే. సినీ పెద్ద‌లు ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపినా ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న రాలేదు.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ పోరాటం..న్యాయం గురించి చిరంజీవి మాట్లాడ‌టం వెనుక అంత‌రార్ధం ఏంటి? అని చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌వ‌న్ కి పూర్తిగా ప్ర‌భుత్వం వ్య‌తిరేకంగా ఉండ‌టం..`రిప‌బ్లిక్` ఈవెంట్ లో ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల్ని ఉద్దేశించి దూషించ‌డం ఎలాంటి ర‌గ‌డ‌కు దారి తీసిందో తెలిసిందే. ఆ త‌ర్వాత ప‌వ‌న్ ఒక్క‌డే ప్ర‌భుత్వంతో ఒంట‌రి పోరాటానికి దిగారు. దీన్ని రాజ‌కీయ కోణంగా భావించి ఆ స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ నుంచి ఏ ఒక్క‌రు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల్ని స‌మ‌ర్ధించ‌లేదు. పైపెచ్చు ఆయ‌న‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించారు. స‌రిగ్గా ఇప్పుడు చిరంజీవి త‌మ్మ‌డు నీవెంట నేను ఉన్నానంటూ ప‌రోక్షంగా స్పందించిన‌ట్లు అయింది.