Begin typing your search above and press return to search.
మెగాస్టార్ పుత్రోత్సాహంబు..!
By: Tupaki Desk | 27 Aug 2019 6:20 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `సైరా-నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్- మేకింగ్ విజువల్స్ ఇటీవలే రిలీజై యూట్యూబ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇంకో నెలరోజుల సమయం మాత్రమే ప్రమోషన్స్ కి ఛాన్సుంది. ఆ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ బృందం ప్రచారంలో వేగం పెంచారు.
తొలిగా ముంబైలో `సైరా` హిందీ టీజర్ ని రిలీజ్ చేశారు. తెలుగు-తమిళం- హిందీ వెర్షన్ల టీజర్లు ముంబై వేదికగానే సైరా టీమ్ రిలీజ్ చేయడం ఆసక్తికరం. అలాగే మెగాస్టార్ చిరంజీవి .. చరణ్ బృందం బాలీవుడ్ మీడియాతోనూ ఇంటరాక్ట్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ చాలా గమ్మత్తయిన విషయాల్ని మీడియాతో షేర్ చేసుకున్నారు. చిరు మాట్లాడుతూ ``దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఖైదీనంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాను. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనని టెన్షన్ పడ్డాను. అప్పటికే ఉన్న యంగ్ స్టార్స్ పవన్ కల్యాణ్- మహేష్- రామ్ చరణ్ టాలీవుడ్ లో పెద్ద స్టార్లుగా అలరిస్తున్నారు. అయితే ఖైదీనంబర్ 150 చిత్రంతో నన్ను నేను నిరూపించుకున్నాను`` అని తెలిపారు.
అయితే మెగాస్టార్ ఈ సందర్భంలో చరణ్ పై తన అవిభాజ్యమైన ప్రేమాభిమానాల్ని తనదైన శైలిలో వ్యక్తం చేశారు. పవన్ - మహేష్ మధ్య అప్పట్లో బోలెడంత ఆహ్లాదకరమైన పోటీ ఉండేది. ఆ తర్వాతి జనరేషన్ స్టార్లలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ది బెస్ట్ స్టార్ అనే ఉద్ధేశాన్ని కాన్షియస్ గానే వ్యక్తం చేశారు. అంతేనా.. తాను నటించిన `ఖైదీనంబర్ 150` నాన్ బాహుబలి రికార్డుల్ని తిరగరాస్తే.. ఆ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేస్తూ చరణ్ నటించిన `రంగస్థలం` సంచలనం సృష్టించిందని ప్రశంసలు కురిపించారు. ఆసక్తికరంగా రామ్ చరణ్ `ఖైదీనంబర్ 150` లాంటి బ్లాక్ బస్టర్ ని నాన్నకు ప్రేమతో కానుకగా ఇచ్చారు. ఇప్పుడు `సైరా` లాంటి భారీ హిస్టారికల్ బయోపిక్ చిత్రాన్ని కానుకగా ఇస్తున్నారు.