Begin typing your search above and press return to search.
'రిపబ్లిక్' హిట్ తో సాయితేజ్ మరింత త్వరగా కోలుకుంటాడు: మెగాస్టార్
By: Tupaki Desk | 1 Oct 2021 5:30 AM GMTసాయితేజ్ హీరోగా దేవ కట్టా 'రిపబ్లిక్' సినిమాను రూపొందించాడు. భగవాన్ - పుల్లారావు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి ఈ సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. "సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు 'రిపబ్లిక్' చిత్ర విజయం రూపంలో అందుతాయని ఆశిస్తూ, ఈ సినిమా యూనిట్ లోని వారందరికీ నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎక్సి బిషన్ సెక్టార్ కీ, 'రిపబ్లిక్' చిత్రం విజయం కూడా కోలుకోవడానికి కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
మొదటి నుంచి కూడా దేవ కట్టా ఏదో ఒక సందేశం చుట్టూ కథను అల్లుకుంటూ వెళుతున్నారు. ఒక వైపున వినోదాన్ని అందిస్తూనే, మరో వైపున ఆలోచింపజేస్తాడు. ఆయన గత చిత్రాల జాబితాను పరిశీలిస్తే, ఇదే విషయం అర్థమవుతుంది. సమాజం .. సామాజిక స్పృహ .. అవినీతిని అడ్డుకునే తీరుతోనే ఆయన కథలు నడుస్తూ ఉంటాయి. ఈ సారి ఆయన రాజకీయాలు .. అవినీతి నాయకులు .. ప్రశ్నించే నిజాయితీ పరులైన అధికారుల చుట్టూ తిరుగుతుంది. అవినీతి రాజకీయాల వైపు నుంచి రమ్యకృష్ణ రంగంలోకి దిగితే, నిజాయితీ పరులైన ప్రభుత్వ అధికారులకు ప్రతినిధిగా సాయితేజ్ కనిపిస్తాడు.
ఈ ఇద్దరి మధ్య వార్ నువ్వా? నేనా? అన్నటుగా నడుస్తుందనే విషయం ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్ ల వలన అర్థమవుతోంది. రమ్యకృష్ణ లుక్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పోషించిన 'విశాఖ వాణి' పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందనీ, ఈ పాత్ర నీలాంబరి .. శివగామి పాత్రల సరసన నిలుస్తుందని చెబుతుండటం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. నిండుగా .. నిదానంగా .. నిబ్బరంగా కనిపిస్తూనే, మానవత్వం మచ్చుకైనా లేకుండా తాను చేయవలసిన పనులను చేసుకుపోయే ఈ పాత్రలో ఆమె నటన చూసితీరవలసిందేనని అంటున్నారు.
జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించగా, కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. సాయితేజ్ ప్రమోషన్స్ కి రాలేకపోవడం వలన, పాపం ఈ అమ్మాయి దర్శకుడితో కలిసి చాలా ప్రమోషన్స్ ను కవర్ చేస్తూ వెళ్లింది. ఈ సినిమాలో తన పాత్ర హీరో ఆశయానికి అనుగుణంగా నడుస్తుందని చెప్పింది. సాయితేజ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని అంది. షూటింగుకు వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకూ ఆయన ఆ పాత్రకి సంబంధించిన మూడ్ లోనే ఉండేవారని చెప్పింది. ఒక రోజున 10 నిమిషాల సీన్ ను సింగిల్ టేక్ లో చేసి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారని అంది. ఈ సినిమా విజయం ఆయన మరింత త్వరగా కోలుకోవడానికి కారణమవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.