Begin typing your search above and press return to search.

సాయిపల్లవి వండర్ఫుల్ డాన్సర్ .. ఆమెతో కలిసి డాన్స్ చేయాలనుంది: మెగాస్టార్

By:  Tupaki Desk   |   20 Sep 2021 5:32 AM GMT
సాయిపల్లవి వండర్ఫుల్ డాన్సర్ .. ఆమెతో కలిసి డాన్స్ చేయాలనుంది: మెగాస్టార్
X
నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ 'సినిమా రూపొందింది. నారాయణదాస్ నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి - ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ వేదికపై చిరంజీవి తనదైన శైలిలో హుషారుగా మాట్లాడుతూ సందడి చేశారు.

'ఫిదా' సినిమా సమయంలోనే నేను సాయి పల్లవిని చూశాను. అంతకుముందు ఆమె ఎవరో నాకు తెలియదు. 'ఫిదా' సినిమాలో ఆమె డాన్స్ .. ఆ టైమింగ్ .. ఆ ఎనర్జీ చూసి నేను ఆశర్యపోయాను. నేను ఆ సినిమా చూసిన తరువాత వరుణ్ తేజ్ వచ్చి 'ఎలా చేశాను డాడీ' అని అడిగాడు. 'సారీరా నేను నిన్ను చూడలేదు .. సాయిపల్లవిని చూస్తుండి పోయాను' అన్నాను. అంత వండర్ఫుల్ గా తను డాన్స్ చేసింది. నా లేటెస్ట్ సినిమాలో సాయిపల్లవిని సిస్టర్ పాత్ర కోసం అనుకున్నారు .. కానీ ఆమె ఒప్పుకోలేదు. నేను కూడా ఆమె ఒప్పుకోకపోతేనే బాగుంటుందని అనుకున్నాను. అంత వండర్ ఫుల్ డాన్సర్ తో నేను డాన్స్ చేయాలనుకుంటాను గానీ, 'చెల్లెమ్మా .. ఎలా ఉన్నావమ్మా' అని అనాలనుకోను గదా.

ఒకసారి చెల్లెలిగా చేసిన తరువాత మళ్లీ డాన్స్ చేయాలంటే మనసు ఒప్పదు. ఆ సినిమాను ఆమె ఓకే చేయననడమే మంచిదైంది. అందుకు నేను ఆమెకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఆమె పక్కన రొమాంటిక్ గా డాన్స్ నంబర్ చేయాలని ఉంది .. అదీ ఆమె ఒప్పుకుంటే. అప్పట్లో శ్రీదేవి .. రాధ .. రంభ నాతో పోటీపడి డాన్స్ చేసేవారు. వాళ్లతో డాన్స్ చేయాలంటే ఒక ఛాలెంజింగ్ గా ఉండేది. నాకు తెలిసి సాయిపల్లవితో డాన్స్ చేయడానికి ఈ సినిమాలో చైతూ చాలా ఇబ్బంది పడి ఉంటాడని అనుకుంటున్నాను. 'సారంగధరియా' పాట కోసమైనా ఈ సినిమాను రెండు మూడు సార్లు చూస్తాను" అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.

చిరంజీవి తనని అభినందిస్తుంటే సాయిపల్లవి సంతోషంతో పొంగిపోయింది. ఆమెతో డాన్స్ చేయాలనీ ఉందని అన్నప్పుడు సిగ్గుపడిపోయింది. తనకి సిస్టర్ గా చేయనందనే ప్రస్తావన చిరూ తెచ్చినప్పుడు, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. చిరంజీవిగారిని కలవడమే గొప్ప విషయంగా భావించేదానిననీ, అయితే ఆ సినిమా రీమేక్ కావడం వలన భయపడ్డానని చెప్పింది. ఈ సారి ఆయనతో కలిస్ తప్పకుండా చేయాలని కోరుకుంటున్నట్టుగా స్పష్టం చేసింది. అంతే కాదు .. స్టేజ్ పైకి వెళ్లి చిరంజీవి