Begin typing your search above and press return to search.
‘ఆచార్య’ ఆగమనంకు డేట్ ఫిక్స్
By: Tupaki Desk | 29 March 2020 12:34 PM GMTమెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం ఫస్ట్ లుక్ ను ఉగాది కానుకగా విడుదల చేయాలని మొదట అనుకున్నారు. ఇప్పటికే టైటిల్ ను చిరంజీవి పొరపాటున నోరు జారి ప్రకటించిన విషయం తెల్సిందే. దాంతో ఫస్ట్ లుక్ లేదా టీజర్ ను ఉగాదికి విడుదల చేస్తారంటూ చాలా ప్రచారం జరిగింది. దర్శకుడు కొరటాల శివ కూడా అదే అనుకున్నాడు. కాని ఉగాదికి ఆర్ ఆర్ ఆర్ హడావుడి ఉంటుందని, ఆ వెంటనే చరణ్ బర్త్ డేకు రామరాజు వీడియోను విడుదల చేశారు. అందుకే ఆచార్యను వాయిదా వేశారు.
ఉగాదికి లేదంటే చరణ్ బర్త్ డేకు ఆచార్య లుక్ విడుదల చేసి ఉంటు ఆర్ ఆర్ ఆర్ తో పోటీ ఏర్పడేది. అందుకే ఉగాదిని పూర్తిగా చరణ్ కే కేటాయించిన చిరంజీవి ఆచార్య లుక్‌ను తీసుకు వచ్చేందుకు శ్రీరామ నవమిని ఎంచుకున్నట్లుగా సమాచారం అందుతోంది. కొరటాల శివ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 2వ తారీకున శ్రీరామ నవమికి ఆచార్య నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతుందని అంటున్నారు. ఇక టీజర్ అనుకున్నా కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం ఏమీ జరగడంలేదట.
ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ నటిస్తుండగా కీలక పాత్రలో చరణ్ నటించబోతున్నాడు. ఆయనకు జోడీగా రష్మిక మందన్న నటించబోతుంది. ఇక సినిమా షూటింగ్స్ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేశారు. ఏప్రిల్ మొత్తం కూడా షూటింగ్స్ జరిగే పరిస్థితి లేదు. అందుకే ఈ చిత్రం షూటింగ్ మళ్లీ మే లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో సినిమాను ఆగస్టు లో అన్నారు కాని వాయిదా పడనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆచార్య విడుదల తేదీపై శ్రీరామనవమి సందర్బంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.