Begin typing your search above and press return to search.
ఉగాదికి అనుకున్న ‘ఆచార్య’ ముందే రాన్నున్నాడట
By: Tupaki Desk | 4 March 2020 11:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. వరుస హిట్స్ తో దూసుకు పోతున్న కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కారణంగా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మహేష్ బాబు కూడా ఉంటాడనే వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ఈ చిత్రం టైటిల్ గురించి వస్తున్న పుకార్లకు ఇటీవలే చిరంజీవి ఒక కార్యక్రమంలో నోరు జారీ క్లారిటీ ఇచ్చేశాడు.
ఆ కార్యక్రమంలో ఈ సినిమాకు ‘ఆచార్య’ అంటూ టైటిల్ ను ఖరారు చేసినట్లుగా చిరు చెప్పాడు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఉగాదికి విడుదల చేసి టైటిల్ ను రివీల్ చేయాలని అనుకున్నాడు. కాని చిరంజీవి పొరపాటున నోరు జారడంతో అనుకున్న దానికంటే ముందే ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని కొరటాల నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఎలాగూ టైటిల్ రివీల్ అయ్యింది కనుక ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయడం వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచవచ్చు అని కొరటాల భావిస్తున్నాడట. ఉగాదికి అనుకున్న ఫస్ట్ లుక్ ను రెండు వారాల ముందే అంటే హోళీ పండుగ సందర్బంగా విడుదల చేయబోతున్నారట. నేడో రేపో ఫస్ట్ లుక్ కు సంబంధించిన ప్రీ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నారట. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది.