Begin typing your search above and press return to search.
చిరు.. బన్నీ.. నాని.. టూ మచ్చే!!
By: Tupaki Desk | 18 April 2017 4:17 AM GMTశ్రీమంతుడు సినిమా అంత పెద్ద హిట్టయితే కేవలం రామ్ చరణ్ ఒక్కడే కాల్ చేశాడని మహేష్ చెబితే.. సర్లేండి అందరి దగ్గరా మహేష్ బాబు పోన్ నెంబర్ లేదులే అనుకున్నారు సినిమా లవ్వర్స్. కాని చివరకు నేషనల్ అవార్డులు వచ్చిన సినిమాల వారిని కూడా అభినందించడానికి.. వారి ఫోన్ నెంబర్లు కూడా ఎవ్వరి దగ్గరా లేనట్లున్నాయ్. నెంబర్లు ఎందుకులే.. కనీసం మైకుల్లో కూడా చెప్పేలా లేరు.
మెగాస్టార్ చిరంజీవి.. అల్లు అరవింద్.. అల్లు అర్జున్.. నాని.. కళ్యాణ్ రామ్.. ఇలాంటి పెద్దలందరూ వచ్చిన ''శతమానంభవతి'' సినిమాపై అక్షింతలు వేసి దీవించారు. మొన్న జరిగిన ఒక ఎప్రీషియేషన్ కార్యక్రమంలో వీరందరూ దిల్ రాజును.. శర్వానంద్ ను.. సతీష్ వేగేశ్నను అభినందించారులే. ఆల్రెడీ పెళ్ళి సక్సెస్ గా ముగిసినా.. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా మరోసారి అభిమాన సభ ఏర్పాటు చేసి.. ఈ గానాభజానా హంగామా నిర్వహించారు. కాని ఇదే సందర్భంగా అసలు రీజనల్ ఫిలిం అవార్డుతో పాటు ఉత్తమ మాటల రచయితగా కూడా అవార్డును తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ అండ్ హిజ్ ''పెళ్ళిచూపులు'' సినిమాను మాత్రం చిన్నచూపే చూశారు.
బయట నుండి ఆడియన్స్.. అలాగే ఫిలిం మీడియా.. క్రిటిక్స్.. ఇలా అందరూ ఎప్రీషియేట్ చేశారు కాని.. ఫిలిం ఇండస్ర్టీ నుండి మాత్రం ఎటువంటి ప్రోత్సాహం లభించకపోవడం దురదృష్టకరం అంటున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. అలాగే సినిమాను డిస్ర్టిబ్యూట్ చేసిన మధుర శ్రీధర్ కూడా.. తరుణ్ వంటి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తే.. ఇతర యంగ్ డైరక్టర్లు సరికొత్త కథలతో వచ్చి మరిన్ని అవార్డులు తేవడానికి ఒక బూస్టుగా ఉంటుందని అభిప్రాయంపడ్డారు.
ఫిలిం ఇండస్ర్టీలో ఎవరు ఏం చేసినా అభినందించే చిరంజీవి.. ఫారిన్ షూట్లో పేపర్లు ఎత్తి డస్ట్ బిన్ లో వేసినోళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పే బన్నీ.. తను కూడా చిన్న సినిమాలతోనే పైకొచ్చిన నాని.. అందరితో కలుపుగోలుగా ఉండే కళ్యాణ్ రామ్.. ''పెళ్ళిచూపులు'' సినిమాను అభినందించడం ఎలా మర్చిపోయారు బాసూ?? టూ మచ్ కదూ. ఇలాంటి ఓ నలుగురు అసలు మాట్లాడకపోతే.. ఖచ్చితంగా పెళ్ళిచూపులు పై చిన్నచూపులు పడుతున్నాయనే అనుకోవాలేమో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/