Begin typing your search above and press return to search.
చిరు-బాలయ్యలకు ఓవర్సీస్ కష్టాలు??
By: Tupaki Desk | 20 Dec 2016 5:43 AM GMTఈ సారి సంక్రాంతికి టాలీవడ్ బాక్సాఫీస్ దగ్గర పందెంకోళ్లలా పోటీ పడేందుకు సీనియర్ స్టార్ హీరోలు సిద్ధమైపోయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించి ఖైదీ నంబర్ 150.. నందమూరి బాలకృష్ణ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణిలు పొంగల్ కి పోటీ పడబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాలపై అంచనాలు కుప్పలు తెప్పలుగా ఉన్నా.. ఓవర్సీస్ లో మాత్రం పరిస్థితి అంత పాజిటివ్ గా కనిపించడం లేదు అంటున్నారు విశ్లేషకులు.
అసలు ఓవర్సీస్ రైట్స్ అమ్మకాల దగ్గర నుంచే కష్టాలు కనిపించాయట. ఖైదీ నంబర్ 150కి మొదట 13.5 కోట్ల రేట్ కోట్ చేశారు నిర్మాతలు. ఈ మొత్తం చెల్లించేందుకు ఒక డిస్ర్టిబ్యూటర్ ముందుకు వచ్చినా.. స్థానిక డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ తో వెనక్కి తగ్గిందట. ఇప్పుడు మరో నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ కు రైట్స్ అమ్మారు కానీ.. 10 కోట్లకే ఇచ్చేశారని తెలుస్తోంది. ఈ మొత్తం రికవర్ చేయాలన్నా.. కనీసం 2 మిలియన్ డాలర్లను రాబడితేనే సాధ్యం అవుతుంది. ఓవర్సీస్ లో చిరు స్టామినా ఏంటి అనే విషయంపై ఇప్పటివరకూ క్లూ లేదు కాబట్టి.. అదొక క్లిష్టమైన అంశమేనని చెప్పాలి.
మరోవైపు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని 4 కోట్ల రూపాయలకు ఓవర్సీస్ లో విక్రయించారు. ఈ మొత్తానికి బ్రేక్ ఈవెన్ రావాలన్నా కనీసం 0.9 నుంచి 1 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. ఇప్పటివరకూ ఓవర్సీస్ లో ఈ మొత్తానికి దరిదాపుల్లో కూడా ఏ బాలయ్య సినిమా కలెక్ట్ చేయలేదు. ల్యాండ్ మార్క్ మూవీస్ కావడంతో.. భారీ రేట్లకు విక్రయించారు కానీ.. ఆ మేరకు అసలు బ్రేక్ ఈవెన్ సాధించడంలో కూడా ఖైదీ.. శాతకర్ణిలకు కష్టాలు ఎదురవుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. బట్ కంటెంట్ క్లిక్ అయితే రచ్చ రచ్చే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/