Begin typing your search above and press return to search.

ఈ సమస్యను చిరంజీవి - కృష్ణంరాజు గార్లు పరిష్కరించాలి

By:  Tupaki Desk   |   20 Oct 2019 5:41 PM GMT
ఈ సమస్యను చిరంజీవి - కృష్ణంరాజు గార్లు పరిష్కరించాలి
X
గతంలో ఎప్పుడు లేనంతగా మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ లో గొడవలు జరుగుతున్నాయి. ఎనిమిది నెలల క్రితం మా అధ్యక్షుడిగా ఎన్నికైన నరేష్‌ పై ఇతర సభ్యులు మరియు కార్యవర్తం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన లేకుండానే మీటింగ్‌ నిర్వహిస్తున్నారు. నరేష్‌ లేకుండానే.. ఆయన అనుమతి లేకుండానే జీవిత రాజశేఖర్‌ లు సమావేశం నిర్వహిస్తున్నామంటూ మెసేజ్‌ లు పంపడం జరిగింది. సమావేశం ప్రారంభం అయిన వెంటనే కొందరు సభ్యులు గందరగోళం సృష్టించారు. కొందరు సభ్యులు అలిగి వెళ్లడంతో కొందరు సభ్యులు సమావేశం జరుగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మా తాజా వివాదంపై ఎస్వీబీసీ చైర్మన్‌ మరియు మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు అయిన పృథ్వీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ప్రతి దానికి జీవిత గారిని తప్పుబట్టడం కొందరికి చాలా కామన్‌ అయ్యింది. కొందరు వ్యక్తులు తాము ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా అన్నట్లుగా ఫీల్‌ అవుతున్నారు. నేడు సమావేశంలో జరిగిన పరిణామాలు నాకు చాలా బాధ కలిగించాయి. నా గురువు గారు పరుచూరి గోపాలకృష్ణ గారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించారు. ప్రస్తుతం మా లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చిరంజీవి మరియు కృష్ణంరాజు గారు స్పందించాలని పృథ్వీ కోరాడు.

అధ్యక్షుడు లేకుండా మీటింగ్‌ ఏంటని.. అది న్యాయబద్దం కాదంటూ మా అధ్యక్షుడు నరేష్‌ అన్నారు. అయితే సమావేశంకు కోర్టు అనుమతించిన కారణంగా మా సభ్యులు అంతా కూడా ఈ సమావేశంకు హాజరు అయ్యారు. ఈ సమావేశం కేవలం స్నేహ పూర్వక సమావేశం మాత్రమే కాని మా కు సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదంటూ జీవిత రాజశేఖర్‌ అన్నారు. మా సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు నరేష్‌ వైపు ఉండగా మరి కొందరు జీవిత రాజశేఖర్‌ ల వైపు అయ్యారు. ఈ వివాదంకు సినీ పెద్దలు ఫుల్‌ స్టాప్‌ పెట్టకుంటే మరింత ముదిరే అవకాశం ఉందని మా సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పృథ్వీ అన్నట్లుగా చిరంజీవి మరియు కృష్ణంరాజు గార్లు ఈ విషయమై స్పందిస్తారో చూడాలి.